YouTube: యూట్యూబ్‌లో డబ్బు సంపాదించే 6 అద్భుత మార్గాలు! మనసుపెట్టి చేస్తే మంచి ఆదాయం
యూట్యూబ్ ఇప్పుడు కేవలం వీడియో ప్లాట్‌ఫారమ్ కాదు, ఆదాయ వనరు కూడా. యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడానికి ఏడు ప్రధాన మార్గాలున్నాయి: యాడ్‌సెన్స్, బ్రాండ్ ప్రమోషన్లు, అఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబ్ షార్ట్స్, సొంత ఉత్పత్తుల విక్రయం, లైవ్ స్ట్రీమింగ్, సూపర్ చాట్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు.

ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన యూట్యూబ్ ఇప్పుడు ఆదాయ వనరుగా కూడా మారింది. ఫుల్‌టైమ్ లేదా పార్ట్‌టైమ్‌గా కంటెంట్ క్రియేషన్ చేయాలనుకునే వారికి ఇది అనేక అవకాశాలను అందిస్తోంది. నిపుణుల ప్రకారం యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రధానంగా ఈ 7 మార్గాలు ఉన్నాయి.
యూట్యూబ్ యాడ్‌సెన్స్
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించిన తర్వాత వీడియోలపై ప్రకటనలు చూపబడతాయి. కనీసం 1,000 సబ్‌స్క్రైబర్‌లు, 4,000 గంటల వాచ్ టైమ్ లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అవసరం.
బ్రాండ్ ప్రమోషన్ అండ్ స్పాన్సర్‌షిప్స్
ఛానెల్‌కు మంచి ఫాలోయింగ్ వచ్చిన తర్వాత బ్రాండ్‌లు నేరుగా సంప్రదిస్తాయి. వీడియోల్లో ఉత్పత్తులు ప్రమోట్ చేసి మంచి ఆదాయం పొందవచ్చు.
అఫిలియేట్ మార్కెటింగ్
వీడియో డిస్క్రిప్షన్‌లో ఉత్పత్తుల లింక్‌లను జోడించి, వాటి ద్వారా కొనుగోలు జరిగితే కమిషన్ పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇందుకు ప్రసిద్ధి.
యూట్యూబ్ షార్ట్స్
చిన్న వీడియోల ద్వారా వేగంగా వ్యూస్, సబ్‌స్క్రైబర్‌లు పెరుగుతాయి. వైరల్ కంటెంట్ ద్వారా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది.
స్వంత ఉత్పత్తుల విక్రయం
కోర్సులు, ఇ-బుక్స్, డిజిటల్ ప్రోడక్ట్స్ వంటి వాటిని ప్రేక్షకులకు నేరుగా విక్రయించి స్థిరమైన ఆదాయం పొందవచ్చు.
లైవ్ స్ట్రీమింగ్ అండ్ సూపర్ చాట్
లైవ్ సమయంలో వీక్షకులు సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్‌ల ద్వారా డబ్బు పంపవచ్చు. ఛానెల్ మెంబర్షిప్స్ కూడా అదనపు ఆదాయం అందిస్తాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
