తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ జరిమానా.!
ఇన్‌కమ్ టాక్స్ అధికారులు టాక్స్ చెల్లింపుదారులకు హెచ్చరిక జారీ చేశారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఆధార్ నెంబర్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే.. రూ. 10 వేల భారీ జరిమానా తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులు పాన్ బదులు ఆధార్ కార్డు సమర్పించుకునే విధంగా సెప్టెంబర్ 1వ తేదీ 2019న కొత్త నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ రిటర్న్స్‌తో పాటు బ్యాంక్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్, 50 వేల రూపాయల బాండ్స్, డిమాట్ ఖాతాలకు పాన్ […]
ఇన్‌కమ్ టాక్స్ అధికారులు టాక్స్ చెల్లింపుదారులకు హెచ్చరిక జారీ చేశారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఆధార్ నెంబర్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే.. రూ. 10 వేల భారీ జరిమానా తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులు పాన్ బదులు ఆధార్ కార్డు సమర్పించుకునే విధంగా సెప్టెంబర్ 1వ తేదీ 2019న కొత్త నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఐటీ రిటర్న్స్‌తో పాటు బ్యాంక్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్, 50 వేల రూపాయల బాండ్స్, డిమాట్ ఖాతాలకు పాన్ బదులుగా ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చే వెసులుబాటు ఉంది. అయితే కొందరు తప్పుడు ఆధార్ నెంబర్లు ఇస్తున్నట్లు అధికారుల దృష్టి వచ్చింది. దీనితో ఐటీ శాఖ ఫోకస్ పెట్టి.. తప్పుడు ఆధార్ ఇచ్చినవాళ్లకు భారీగా ఫైన్ విధించే రూల్‌ను అమలులోకి తీసుకొచ్చింది.
1961 ఐటీ చట్టం సెక్షన్ 272 b కింద ఈ జరిమానా విధిస్తున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. గతంలో ప్యాన్ నెంబర్ తప్పు ఇచ్చినప్పుడు ఇలాగే జరిమానా విధించేవారు. ఇప్పుడు అదే రూల్‌ని ఆధార్‌కు పునరుద్ధరించారు. అంతేకాక బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు కూడా వార్నింగ్ ఇచ్చిన ఐటీ శాఖ.. ప్యాన్ కార్డు లేదా ఆధార్ కార్డు వివరాలను సరిగ్గా వెరిఫై చేయకుండా ప్రాసెస్ చేస్తే.. భారీ జరిమానాలను విధిస్తామంటూ హెచ్చరించింది.