Samsung Smart Ring: ఈ రింగ్‌తో కింగ్ మీరే.. స్మార్ట్ వాచ్‌లకు చెక్ పెట్టేలా సామ్‌సంగ్ స్మార్ట్ రింగ్
స్మార్ట్‌వాచ్‌ల్లో వచ్చే వివరాలపై సందేహాలు ఉన్నా ఎక్కువగా వీటిపై ఆధారపడి వాటిని ఓ హెచ్చరికగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కచ్చితమైన వివరాలను అందించే స్మార్ట్ రింగ్‌లు కూడా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా సామ్‌సంగ్ స్మార్ట్ రింగ్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ రింగ్‌తో మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ సరికొత్త ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేస్తుంది. ఇటీవల ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో దాని సాయంతో పని చేసే యాక్ససరీస్‌కు అత్యంత ఆదరణ పొందాయి. ముఖ్యంగా 2019 నుంచి ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా దెబ్బకు అందరికీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంతో బ్లూటూత్ సాయంతో పని చేస్తూ ఆరోగ్య సంబంధిత ట్రాకింగ్ వివరాలను అందించే స్మార్ట్‌వాచ్‌లు అందరినీ ఆకర్షించాయి. అయితే ఈ స్మార్ట్‌వాచ్‌ల్లో వచ్చే వివరాలపై సందేహాలు ఉన్నా ఎక్కువగా వీటిపై ఆధారపడి వాటిని ఓ హెచ్చరికగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కచ్చితమైన వివరాలను అందించే స్మార్ట్ రింగ్‌లు కూడా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా సామ్‌సంగ్ స్మార్ట్ రింగ్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ రింగ్‌తో మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ స్మార్ట్ రింగ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సామ్‌సంగ్ ఇటీవల తన అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ రింగ్‌ను లాంచ్ చేసింది. స్మార్ట్ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలనే సామ్‌సంగ్ సరికొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాండ్ లోపలి భాగంలో కొన్ని కనిపించే సెన్సార్‌లతో మెరిసే రింగ్ చూడడానికి హైపర్‌బోలిక్‌గా ఉంటుంది. ఈ రింగ్ ఇంట్లో రోజువారీ ఆరోగ్యానికి సమగ్రమైన ఇంకా సరళీకృతమైన విధానంతో నిర్వహించడానికి ఉపయోగపడుతుందని సామ్‌సంగ్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ రింగ్ సుదీర్ఘ కాలంలో స్థిరమైన, కచ్చితమైన ట్రాకింగ్ డేటాను కలిగి ఉంటుంది. ఈ రింగ్‌లో ప్రముఖ సెన్సార్ టెక్నాలజీలు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రింగ్ 24/7 ధరించడానికి తగినంత సౌకర్యంగా ఉంటుంది. ఇటీవల నిర్వహించిన అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కూడా ఈ రింగ్‌ను చాలా మంది ఇష్టపడ్డారు. ఈ స్మార్ట్ రింగ్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ సామ్‌సంగ్ గెలాక్సీ రింగ్ గెలాక్సీ వాచ్‌కు అనుబంధంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా స్మార్ట్ రింగ్‌లు సరిగ్గా పని చేయాలంటే వాటికంటూ ప్రత్యేక యాప్‌లు ఉండాల్సి ఉంటుంది. అలా కాకుండా థర్డ్ పార్టీ యాప్స్‌పై ఆధారపడి పని చేసేలా స్మార్ట్ రింగ్‌లను లాంచ్ చేస్తే అంతగా ప్రయోజనం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే సామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌కు అనుసంధానంగా సామ్‌సంగ్ హెల్త్ యాప్ పని చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్ రింగ్ మార్కెట్‌లో సామ్‌సంగ్ సక్సెస్ అయితే ఇతర కంపెనీలు కూడా స్మార్ట్ రింగ్ తయారీపై ప్రత్యేక ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








