Smart Glasses: అధునాతన ఫీచర్లతో స్మార్ట్ గ్లాసెస్ రిలీజ్ చేసిన ఎంఐ.. ఇక ఆ సమస్యకు చెక్..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. వివిధ కంపెనీలు అధునాతన స్మార్ట్ యాక్ససరీస్‌ను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఎంఐ కంపెనీ సూపర్ స్మార్ట్ గ్లాసెస్‌ను రిలీజ్ చేసింది. ఏఐ ఫీచర్స్‌తో రిలీజ్ చేసిన మొట్టమొదటి స్మార్ట్ వాచ్ అని కంపెనీ చెబుతుంది. ఈ నేపథ్యంలో ఎంఐ స్మార్ట్ వాచ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Smart Glasses: అధునాతన ఫీచర్లతో స్మార్ట్ గ్లాసెస్ రిలీజ్ చేసిన ఎంఐ.. ఇక ఆ సమస్యకు చెక్..!
Xiaomi Ai Glasses

Updated on: Jul 02, 2025 | 3:08 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఎంఐ ఇటీవల కాలంలో స్మార్ట్ యాక్ససరీస్‌ను రిలీజ్ చేస్తుంది. తాజాగా చైనాలో ఏఐ ఫీచర్స్‌తో ఎంఐ గ్లాసెస్‌ను రిలీజ్ చేసింది. ఈ గ్లాసెస్ మెటా రే బాన్ స్మార్ట్ గ్లాసెస్‌కు పోటీగా విడుదల చేసిందని టెక్ నిపుణులు చెబుతన్నారు. ఈ కొత్త గ్లాసెస్ ఎంఐ దాని సొంత ఓఎస్ ద్వారా శక్తిని పొందుతాయి. అలాగే హార్డ్‌వేర్ కోసం స్నాప్ డ్రాగన్ ఏఆర్ చిప్‌సెట్ ఉంటుంది. ముఖ్యంగా మీ పరిసరాలను స్కాన్ చేసేలా అధిక-రిజల్యూషన్ కెమెరా ఈ గ్లాసెస్ ప్రత్యేకత. గత కొన్ని సంవత్సరాలుగా మెటా రే బాన్ గ్లాస్‌లో ఈ ఫీచర్ ఆకట్టుకుంటుంది. అయితే ఎంఐ మాత్రం ఏఐ ఫీచర్స్‌తో స్మార్ట్ గ్లాసెస్‌ను లాంచ్ చేయడంతో రియల్-టైమ్ టెక్స్ట్ ట్రాన్స్‌లేషన్‌తో పాటు వాయిస్ ఆధారిత ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఎంఐ గ్లాసెస్ ధర సుమారు రూ. 23,500 ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్టాండర్డ్ వెర్షన్ మల్టీ కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఇతర లెన్స్ వేరియంట్‌లతో రిలీజ్ చేసిన వాటి ధర సుమారు రూ. 35,400 వరకు ఉంటుంది.

ఎంఐ ఏఐ గ్లాసెస్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఇతర ప్రాంతాలకు వస్తాయో? స్పష్టంగా కంపెనీ పేర్కొనలేదు. ఎంఐ ఏఐ గ్లాసెస్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ పరికరాలతో యాడ్ చేసుకోవచ్చు. హైపర్ ఓఎస్ ఎఐ ఫోన్‌ను మాత్రమే ఉపయోగించి ఈ గ్లాసెస్‌ను యాడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ ఏఆర్ + చిప్ ద్వారా శక్తిని పొందే ఈ స్మార్ట్ గ్లాసెస్ 4 జీబీ + 32 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే 12 ఎంపీ కెమెరా రావడంతో దీన్ని ధరించి సులభంగా ఫోటోలు, వీడియోలను తీయవచ్చు. కనెక్టివిటీ కోసం ఏఐ గ్లాసెస్ వైఫై 6తో బ్లూటూత్ 5.4కు సపోర్ట్ చేస్తుంది. 

ట్రాన్స్‌లేషన్ పనులను నిర్వహించడంతో పాటు వస్తువులను గుర్తించే ఎంఐ నుంచి ఏఐ అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది. బ్యాకప్ క్లెయిమ్‌లతో ఎంఐ ఏఐ గ్లాసెస్ 263 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఈ గ్లాసెస్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 8 గంటలకు పైగా పని చేస్తుంది. యూఎస్‌బీ టైప్‌-సీ చార్జర్‌తో 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.  ఇటీవలే భారతదేశంలో రేబాన్ గ్లాసెస్‌ను ప్రారంభించారు. రెబాన్ కంపెనీ ఓక్లీతో కలిసి మరింత ప్రీమియం వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఈ గ్లాసెస్ ధర 350 డాలర్ల కంటే ఎక్కువ ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి