Apple Watch: ఆపిల్ వాచ్.. నిజంగా ప్రజల జీవితాలను కాపాడుతుందనడంలో సందేహం లేదు. హార్ట్ రేట్ పై యూజర్లను ఎప్పటికప్పుడు హెచ్చరించి, వారి ప్రాణాలను కాపాడుతోంది. ఇప్పటికే ఎన్నో వార్తలు ఇలాంటివి విన్నాం. ఆపిల్ వాచ్ లో హార్ట్ రేట్ యాప్ ఎప్పటికప్పుడు మన హార్ట్ రేట్ ను గుర్తించి, వాచ్ స్క్రీన్ పై చూపిస్తోంది. అయితే, హార్ట్ రేట్ లో ఏవైన తేడాలు గమనిస్తే.. వెంటనే యూజర్లను హెచ్చరిస్తుంది. ఆపిల్ వాచ్ వాడే ఎవరికైనా ఈ విషయం తెలిసిందే. తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఆపిల్ వాచ్ ఓ మహిళ హార్ట్ రేట్ లో ఉన్న తేడాలను గమనించి హెచ్చరించింది. దీంతో అసలు ఆమెకు గుండెపోటు ఉందనే సంగతి తెలియకపోవడం గమనార్హం. డబ్ల్యూజడ్ జడ్ 13 నివేదిక మేరకు.. మిచిగాన్ కు చెందిన ఓ మహిళ హృదయ స్పందన రేటులో తేడాలు గమనించిన ఆపిల్ వాచ్.. ఆమెను హెచ్చరించింది. దీంతో ఆమె అపనమ్మకంగానే హాస్పిటల్ కు వెళ్లి చెక్ చేయించుకుంది. దీంతో షాకవ్వడం ఆమె వంతైంది. ఆమెకు నిజంగానే గుండె పోటు ఉందని తెలియడంతో… ఆపిల్ వాచ్ కు కృతజ్ఞతలు తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. మిచిగాన్‌కు చెందిన డయాన్ ఫీన్‌స్ట్రా ఆపిల్ వాచ్ ను ఉపయోగిస్తోంది. ఒక రోజు తన గుండె స్పందనల్లో తేడా ఉందని ఆపిల్ వాచ్ ఆమెను హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఆ మహిళ.. తన భర్తను వెంట తీసుకుని హాస్పిటల్ కు వెళ్లింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..’ఏప్రిల్ 22న నా గుండె నిమిషానికి 169 బీట్స్ చూపించింది. అయినా నేను చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాను. ఆరోజు నేను చాలాసేపు వ్యాయామం చేశాను. అందువల్ల హార్ట్ బీట్ ఇలా పెరిగిందేమోనని అనుకున్నాను. ఈ విషయం మా ఆయనతో చర్చించాను. ఎందుకైనా మంచిదని డాక్టర్ ను కలిశాము’ అని తెలిపింది. ఆసుపత్రికి చేరుకున్న తరువాత, డాక్టర్లు EKG చేశారు. దీంట్లో ఇటీవల ఫీన్స్ట్రాకు గుండెపోటు వచ్చిందని వెల్లడించింది. కానీ, గుండెపోటు వచ్చిన విషయం ఆమెకు తెలియకపోవడం గమనార్హం.
“మగవారితో పోల్చితే.. మహిళలకు గుండె పోటు లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. నా ఎడమ చేతిలోకి నొప్పిగా ఉంది. నా ఎడమ కాలులోనూ కొద్దిగా వాపు ఉంది. నాకు అజీర్ణ సమస్య కూడా ఉంది. దాంతో ఎసిడిటీ ఉందని అనుకున్నట్లు” ఆమె పేర్కొంది. ఈకేజీ పూర్తి చేసిన వెంటనే, ఫీన్స్ట్రా మరిన్ని పరీక్షలు చేయించుకుంది. ఈ రిపోర్టులో రక్త నాళాల్లో ఏదో అడ్డుగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈమెకు స్టెంట్ ను వేశారు. ఈమేరకు ప్రతీ ఉదయం హృదయ స్పందన రేటును గమనించుకోవాలని ప్రజలను ఫీన్స్ట్రా కోరుతోంది. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి ప్రాణాంతకంగా మారవచ్చని తెలిపింది.
అంతకుముందు, 78 ఏళ్ల వ్యక్తి తన ప్రాణాలను కాపాడినందుకు ఆపిల్ వాచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. గుండెపోటు రావడంతో.. ఆ వ్యక్తి తన ఇంటి ఆవరణలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఆపిల్ వాచ్.. 911 సహాయం కోసం అలర్ట్ చేసింది. దీంతో ఆయన ప్రాణాలను కాపాడినందుకు ఆపిల్ వాచ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ మేరకు మైక్ యాగర్ ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ, నేను ఆఫీర్లను మొదటగా అడిగిన విషయం ఏంటంటే.. మీరు నా వద్దకు ఎలా వచ్చారు? అని అడిగినట్లు తెలిపాడు. దానికి వారు.. చెప్పిన సమాధానం విని షాకయ్యాను. మీ వాచ్ నుంచి మాకు ఓ మెసేజ్ వచ్చింది. దాంతో మేము అలర్ట్ అయ్యామని తెలిపినట్లు ఆయన పేర్కొన్నాడు.
Also Read:
Google Maps: విదేశీ పర్యాటకులకు చుక్కలు చూపించిన గూగుల్ మ్యాప్.. అసలేం జరిగిందంటే..!