AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: రాత్రి పడుకునే ముందు మొబైల్ డేటాను ఆఫ్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

మీ ఫోన్ నెట్‌వర్క్ లేదా వైఫైని ఆన్‌లో ఉంచితే ఫోన్‌లోని అన్ని యాప్‌లు యాక్టివ్‌గా ఉంటాయి. ఇది మీ ప్రైవసీని ప్రమాదంలో పడేస్తుంది. రాత్రిపూట మొబైల్ డేటా ఆన్‌లో ఉన్నప్పుడు.. మాల్వేర్, వైరస్‌లు, హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

Tech Tips: రాత్రి పడుకునే ముందు మొబైల్ డేటాను ఆఫ్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?
Why You Should Turn Off Mobile Data
Krishna S
|

Updated on: Aug 30, 2025 | 5:58 PM

Share

మీరు రాత్రి పడుకునే ముందు మొబైల్ డేటా లేదా వైఫై ఆఫ్ చేస్తున్నారా? ఒకవేళ ఆన్ చేసి ఉంచుతున్నట్లయితే, అది మీ వ్యక్తిగత భద్రతకు, ఆరోగ్యానికి, ఫోన్ బ్యాటరీకి ఎంత ప్రమాదకరమో ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. చాలా మందికి తెలియని ఈ ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ప్రైవసీకి ముప్పు

సాధారణంగా మన ఫోన్‌లలో చాలా యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. కొన్ని యాప్‌లు మనకు తెలియకుండానే మైక్రోఫోన్ లేదా కెమెరాను ఉపయోగిస్తాయి. ఇటీవలే ఒక ట్విట్టర్ ఇంజనీర్ ఈ విషయాన్ని వెల్లడించగా.. గూగుల్ కూడా ఈ బగ్‌ను అంగీకరించింది. మీ మొబైల్ డేటా ఆన్‌లో ఉంటే మీ ఫోన్‌లోని అన్ని యాప్‌లు యాక్టివ్‌గా ఉంటాయి. ఇది మీ ప్రైవసీను ప్రమాదంలో పడేస్తుంది.

ట్రాక్ చేసే ప్రమాదం

అంతేకాకుండా ఇంటర్నెట్ ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండడం వల్ల హ్యాకర్లు, మాల్వేర్, వైరస్‌లకు మీ ఫోన్ సులభంగా గురవుతుంది. వారు మీ ఫోన్‌ను హ్యాక్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. మొబైల్ డేటా ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటే మీ ఫోన్ నిరంతరంగా డేటాను పంపుతుంది, స్వీకరిస్తుంది. ఇది మీ స్థానాన్ని, ఆన్‌లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించవచ్చు. మీ గురించి వ్యక్తిగత సమాచారం సేకరించడానికి కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది.

ఇతర ప్రయోజనాలు

రాత్రిపూట మొబైల్ డేటాను ఆఫ్ చేయడం వల్ల కేవలం గోప్యతే కాకుండా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

డేటా ఆదా: మొబైల్ డేటాను ఆఫ్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్‌లు డేటాను వాడకుండా నిలిచిపోతాయి. దీనివల్ల మీ నెలవారీ డేటా ప్లాన్ చాలా ఆదా అవుతుంది.

మంచి నిద్ర: సోషల్ మీడియా లేదా ఇతర యాప్‌ల నుంచి వచ్చే నోటిఫికేషన్లు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. మొబైల్ డేటా ఆఫ్ చేయడం వల్ల ఈ నోటిఫికేషన్లు రావు. తద్వారా మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

ఆరోగ్యం: నిద్ర సరిగా లేకపోతే అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డేటా ఆఫ్ చేసి నిద్రించడం వల్ల మీ నిద్ర మెరుగవుతుంది. తద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

బ్యాటరీ ఆదా: ఇంటర్నెట్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు నిరంతరంగా బ్యాటరీని ఖర్చు చేస్తాయి. డేటా ఆఫ్ చేయడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.

అనవసర అప్‌డేట్లు రావు: చాలా ఫోన్‌లలో యాప్‌లు, సాఫ్ట్‌వేర్ ఆటో-అప్‌డేట్ అవుతుంటాయి. ఇది మీ డేటాను వేగంగా ఖర్చు చేస్తుంది. డేటా ఆఫ్ చేయడం వల్ల ఈ అప్‌డేట్లు జరగవు. దీనితో మీ డేటా వినియోగం అదుపులో ఉంటుంది.

ఈ చిన్న అలవాటు మీ జీవితానికి చాలా భద్రత, ప్రశాంతత, ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి, పడుకునే ముందు మీ మొబైల్ డేటా లేదా వైఫైని ఆఫ్ చేయడం మర్చిపోకండి.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..