దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్ కేరళ, కర్నాటక రాష్ట్రాలపై అధిక ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు రోజుల్లో ఈ భారత తీర ప్రాంతానికి తగులుతుంది. ఈ నెల 16 నుంచి 18 వరకు ఈ తుఫాను ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ఆ రెండు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌పై కొద్దిపాటి ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ తుఫాన్‌కు ‘తౌక్టే’గా నామకరణం చేశారు. ‘తౌక్టే’ అనే పేరును మయన్మార్ ఎంపిక చేసింది. అయితే రాబోయే తుఫాన్ పేరు తౌక్టే అని.. ఎవరు నిర్ణయిస్తారు..? అసలు తుఫానులకు పేర్లు ఎలా వస్తున్నాయి..? ఎవరు పెడతారు…? అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా..!
అయితే తుఫానులకు ‘తౌక్టే’ పేరు ఎలా పెడతారు..? తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచవాతావరణతోపాటు ఆర్థిక మరియు సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. తుఫాన్ల హెచ్చరికలు, సూచనలు చేయడం ఈ కేంద్రాల పని. అంతే కాదు వీటికి పేర్లను నిర్ణయించడం కూడా కేంద్రాలే చూస్తుంటాయి. ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్(IMD) కూడా ఒకటి. ఈ కేంద్రలు 13 సభ్య దేశాలకు చెందిన తుఫానులకు చెందిన సమాచారం అందించడం వీరి విధి.
2000వ సంవత్సరంలో 27వ సదస్సును మస్కట్, ఓమన్ దేశాల్లో జరిగింది. ఆ సదస్సులో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానులకు సంబంధించి పేర్లు పెట్టాలన్న ఒప్పందం కుదిరింది. ఇక పలుమార్లు సభ్యదేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత 2004 సెప్టెంబరులో తుఫానులకు నామకరణం చేయడం మొదలు పెట్టారు. బంగాళా ఖాతం, అరేబియన్ సముద్రాల తీరంలో ఉన్న ఎనిమిది దేశాలను ముందుగా గుర్తించారు. ఇంగ్లీష్‌లోని ఆల్ఫబెటిక్ ఆర్డర్ ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలను పొందుపర్చారు.
కొన్ని పేర్లను ముందుగానే నిర్ణయిస్తారు ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం. రానున్న తుఫానుకు ఒక పేరును సూచించాలని సభ్యదేశాలను కోరుతుంది. ఇది అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం తీరంలో ఉన్న సభ్య దేశాలకు పంపుతుంది.
తుఫానులకు పేర్లుపెట్టడం వల్ల అధికారులు, సైంటిస్టులు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతోపాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకు తుఫానులకు పేర్లు పెట్టడం అవసరం. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. తుఫాన్లకు పేరు పెట్టే సంస్కృతికి అమెరికా తెరలేపింది.
కాగా, ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టారు. 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి.
మొత్తం 64 పేర్లను ఈ ఎనిమిది దేశాలు ఎంపిక చేయగా ఇప్పటికి 57 పేర్లను ఆయా తుఫాన్లకు నామకరణం చేసేశారు. భారత్ సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలి, ఆకాష్ ఉండగా… మాలా అనే పేరును శ్రీలంక సూచించింది. ఇక హెలెన్ అనే పేరును బంగ్లాదేశ్ నామకరణం చేయగా.. నీలోఫర్ పాకిస్తాన్ పెట్టింది. అయితే జాబితాలోని ఈ పేర్లు ఒక క్రమంలో పెడతారని తిరిగి మళ్లీ అవే పేర్లను పెట్టరని అధికారులు తెలిపారు.