- Telugu News Photo Gallery Technology photos Google smart watch introducing new keyboard called gboard can give typing feature
Google Watch: ఇకపై స్మార్ట్ వాచ్‌లోనూ టైపింగ్ చేసుకోవచ్చు.. జీ బోర్డును తీసుకురానున్న గూగుల్..
Google Watch: స్మార్ట్ వాచ్‌లలో అన్ని రకాల ఫీచర్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. టైపింగ్ ఫీచర్ మాత్రం రాలేదు. దీనికి చెక్ పెట్టడానికే గూగుల్ జీబోర్డ్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీని సహాయంతో..
Updated on: May 14, 2021 | 4:27 PM

ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయాన్ని తెలిపే ఓ సాధనం. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ వాచ్‌లు అన్ని పనులు చేసి పెడుతున్నాయి.

హార్ట్ బీట్ నుంచి, శరీరంలో ఆక్సిజన్ స్థాయిల వరకు ఇలా అన్ని పనులకు స్మార్ట్ వాచ్‌లు కేరాఫ్‌గా మారాయి.

ఈ క్రమంలోనే బడా కంపెనీలు సైతం స్మార్ట్ వాచ్‌ల తయారీలోకి అడుగుపెట్టడంతో వీటిపై బాగా క్రేజ్ పెరిగింది.

అయితే స్మార్ట్ వాచ్‌లలో అన్ని రకాల ఫీచర్లు ఉన్నప్పటికీ టైపింగ్ మాత్రం అందుబాటులో లేదు. దీనికి చెక్ పెట్టడానికే గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసురానుంది.

ఇందుకోసం గూగుల్ జీబోర్డును పరిచయం చేయనుంది. ఈ కొత్త ఓఎస్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

స్మార్ట్ వాచ్‌లో టైపింగ్ చేయడం కష్టం కాబట్టి.. ఎమోజీల కోసం షార్ట్‌కట్స్, నంబర్ కీప్యాడ్, వాయిస్ ఇన్‌పుట్ వంటి కొత్త ఫీచర్లనూ ఇందులో జోడించటం విశేషం.





























