Whatsapp: వాట్సాప్‌లో అందుబాటులోకి వస్తున్న ‘ఎడిట్‌’ ఆప్షన్‌.. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే

|

May 19, 2023 | 8:26 AM

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి ఆదరణ లభిస్తోంది. ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులో ఉన్నా వాట్సాప్‌ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది...

Whatsapp: వాట్సాప్‌లో అందుబాటులోకి వస్తున్న ఎడిట్‌ ఆప్షన్‌.. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే
Whatsapp
Follow us on

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి ఆదరణ లభిస్తోంది. ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులో ఉన్నా వాట్సాప్‌ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక యూజర్ల అవసరాలను తీరుస్తూ కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఎడిట్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ ఉపయోగం ఏంటి.? ఎలా వాడాలి.? లాంటి వివరాలు మీకోసం..

సాధారణంగా ఎదుటి వ్యక్తికి పంపించిన మెసేజ్‌లో ఏదైనా పొరపాటు ఉంటే ఏం చేస్తాం.. ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌’ అనే ఫీచర్‌ సహాయంతో డిలీట్‌ చేసి మళ్లీ మెసేజ్‌ను పంపిస్తుంటాం. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీంతో మనం పంపిన మెసేజ్‌లో ఎమైనా తప్పులు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. గత వారం నుంచి టెస్టింగ్ కోసం దీనిని iOS, Android బీటాలలో విడుదల చేసింది. త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది.

ఈ ఎడిట్‌ ఆప్షన్‌ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.10.13, iOS వెర్షన్ 23.10.0.70 లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ కొత్త ఫీచర్‌తో అవతలివారికి పంపిన మెసేజ్‌లను 15 నిమిషాల లోపు ఎడిట్ చేసుకోవచ్చు. 15 నిమిషాల వ్యవధిలో ఎన్నిసార్లైనా మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ఎడిట్ చేయాలనునే మెసేజ్‌ పై క్లిక్ చేసి కాసేపు హోల్డ్‌ చేయాలి, ఇలా చేస్తే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒక్కసారి మెసేజ్ ఎడిట్ చేశాక, అవతలి వారికి ‘ఎడిటెడ్’ అని ఆ మెసేజ్ కింద చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..