Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌ వెబ్‌ వాడుతున్నారా.? స్క్రీన్ లాక్ ఫీచర్‌ గురించి తెలుసా.?

ప్రస్తుతం వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్లలో వాట్సాప్‌ సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా ఆఫీసుల్లో వాట్సాప్‌ వెబ్ ఉపయోగిస్తున్న వారు ప్రైవసీ విషయంలో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ వెబ్‌లో ఒకసారి లాగిన అయిన తర్వాత అప్పుడప్పుడు సిస్టమ్‌పై నుంచి లేస్తుంటాం. దీంతో ప్రైవసీలో భాగంగా వాట్సాప్‌ లాగవుట్‌ చేసి బయటకు వెళ్తుంటారు...

Whatsapp: వాట్సాప్‌ వెబ్‌ వాడుతున్నారా.? స్క్రీన్ లాక్ ఫీచర్‌ గురించి తెలుసా.?
Whatsapp Web
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 02, 2023 | 10:54 AM

వాట్సాప్‌ యూజర్లను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. కొంగొత్త ఫీచర్లతో తమ యూజర్లను చేజారిపోకుండా చూసుకుంటోంది. ముఖ్యంగా యువతను టార్గెట్‌ చేస్తూ ఎన్నో ఫీచర్స్‌ను తీసుకొస్తోంది. ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ తీసుకొస్తున్న కొత్త ఫీచర్స్‌తో వాట్సాప్‌ వాడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ప్రస్తుతం వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్లలో వాట్సాప్‌ సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా ఆఫీసుల్లో వాట్సాప్‌ వెబ్ ఉపయోగిస్తున్న వారు ప్రైవసీ విషయంలో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ వెబ్‌లో ఒకసారి లాగిన అయిన తర్వాత అప్పుడప్పుడు సిస్టమ్‌పై నుంచి లేస్తుంటాం. దీంతో ప్రైవసీలో భాగంగా వాట్సాప్‌ లాగవుట్‌ చేసి బయటకు వెళ్తుంటారు. మళ్లీ అవసరం ఉన్నప్పుడు తిరిగి లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

ఇలా ప్రతీసారి లాగవుట్‌, లాగిన్‌ చేయడం ఇబ్బందితో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు. మాటిమాటి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, లాగిన్‌ కావాల్సి ఉంటుంది. దీంతో ఈ అంశం ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. లాక్‌ స్క్రీన్ పేరుతో వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో ప్రైవసీకి పెద్ద పీట వేశారు. ఇంతకీ ఈ లాక్‌ స్క్రీన్‌ ఫీచర్‌ ఉపయోగం ఏంటి.? దీనిని ఎలా ఎనేబులు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే..

* ముందుగా సెర్చ్‌ బాక్స్‌లో వాట్సాప్‌ వెబ్‌ ఎంటర్ చేయాలి.

* అనంతరం క్యూఆర్‌ కోడ్‌తో లాగిన్‌ కావాలి.

* ఆ తర్వాత వాట్సాప్‌లో పైన కనిపించే థ్రి డాట్స్‌పై క్లిక్‌ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

* సెట్టింగ్స్‌లో ప్రైవసీని సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తూ.. లాక్‌ స్క్రీన్‌ ఆప్షన్‌ను సెలక్ చేసుకోవాలి.

* అనంతరం మీకు నచ్చిన పాస్‌వర్డ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఓకే బటన్‌పై క్లిక్‌ చేస్తే కన్‌ఫర్మ్‌ అవుతుంది.

* ఆటోమేటిక్‌గా స్క్రీన్‌ లాక్‌ టైమింగ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు ఎంచుకున్న సమయానికి స్క్రీన్ దానంతటదే స్క్రీన్‌ లాక్‌ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..