Whatsapp: వాట్సాప్‌ కీలక నిర్ణయం.. నెల రోజుల్లో 75 లక్షల అకౌంట్స్..

|

Dec 04, 2023 | 4:51 PM

వినియోగారుల ఫిర్యాదుకుల సంబంధించి సమగ్ర వివరాలను పరగిణలోకి తీసుకుని, అకౌంట్స్‌ను దుర్వినియోగపరుస్తున్న వారి ఖాతాలను బ్యాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్‌ ఏకంగా 75 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 31 తేదీల మధ్య మొత్తం 7548000 ఖాతాలను నిషేధించింది. ఇదిలా ఉంటే..

Whatsapp: వాట్సాప్‌ కీలక నిర్ణయం.. నెల రోజుల్లో 75 లక్షల అకౌంట్స్..
Whatsapp
Follow us on

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ భారత దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌, 2021 చట్టాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ఆపరేట్‌ అవుతున్న వాట్సాప్‌ అకౌంట్స్‌ను బ్యాన్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ నెల తాము బ్యాన్‌ చేసే అకౌంట్స్‌కు తాలుకు వివరాలను వాట్సాప్‌ ప్రకటిస్తుంది.

వినియోగారుల ఫిర్యాదుకుల సంబంధించి సమగ్ర వివరాలను పరగిణలోకి తీసుకుని, అకౌంట్స్‌ను దుర్వినియోగపరుస్తున్న వారి ఖాతాలను బ్యాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్‌ ఏకంగా 75 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 31 తేదీల మధ్య మొత్తం 7548000 ఖాతాలను నిషేధించింది. ఇదిలా ఉంటే.. 19,19,000 వినియోగదారు నివేదికల కంటే ముందుగానే ఈ అకౌంట్స్‌ను వాట్సాప్‌ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక అక్టోబర్‌ నెలలో దేశంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 9063 ఫిర్యాదులు వచ్చినట్లు వాట్సాప్‌ తెలిపింది. వీటిలో ఖాతాలను నిషేధించడం లేదా గతంలో నిషేధించిన ఖాతాను పునరుర్ధరించారు. ఇదిలా ఉంటే భారత్‌లో మొత్తం 500 మిలియన్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తుండగా, అక్టోబర్‌ నెలలో మొత్తం 9,063 ఫిర్యాదులను అందుకున్నారు. వీటిపై వాట్సాప్‌ 12 చర్యలు తీసుకుంది.

ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 1, 2023 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు మొత్తం 7,111,000 ఖాతాలను నిషేధించింది. వీటిలో 2,571,000 ఖాతాలను ఎలాంటి నివేదికలు అందకుండానే నిషేధించారు. ఈ ఫిర్యాదుల్లో అకౌంట్ సపోర్ట్ (1,031), బ్యాన్ అప్పీల్ (7,396), అదర్ సపోర్ట్ (1,518), ప్రొడక్ట్ సపోర్ట్ (370), సేఫ్టీ (127) వంటి కేటగిరీల్లో 10,442 యూజర్ రిపోర్ట్‌లను స్వీకరించినట్లు వాట్సా్‌ తెలిపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..