WhatsApp Multi Account: ఒకే ఫోన్.. ఒకే వాట్సాప్.. రెండు ఖాతాలు.. ఒకేసారి వాడొచ్చు.. పూర్తి వివరాలు ఇవి..

ఇప్పటికే లాక్ చాట్, స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్ వంటి అత్యాధునిక ఫీచర్లను వినియోగదారులకు అందించిన వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాబీటా ఇన్ ఫో ప్రకారం దానిపేరు వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్. ఈ ఫీచర్ సాయంతో మీరు ఒకే ఫోన్లోని యాప్ లో రెండు అకౌంట్లను వాడుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

WhatsApp Multi Account: ఒకే ఫోన్.. ఒకే వాట్సాప్.. రెండు ఖాతాలు.. ఒకేసారి వాడొచ్చు.. పూర్తి వివరాలు ఇవి..
WhatsApp
Follow us
Madhu

|

Updated on: Sep 06, 2023 | 11:43 AM

ప్రస్తుతం అన్ని ఫోన్లు కూడా డ్యూయల్ సిమ్స్ తోనే వస్తున్నాయి. రెండు నంబర్లను ప్రతి ఒక్కరూ వినియోగిస్తుంటారు. ఒకటి కంపెనీకని, మరొకటి వ్యక్తిగతం అంటూ వాడుతుంటారు. అయితే అందులోని ప్రధానమైన యాప్ వాట్సాప్ మాత్రం ఒకటే ఉంటుంది. అందులో ఏదైనా ఒక నంబర్ తో మాత్రమే అకౌంట్ క్రియేట్ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. దీంతో రెండో నంబర్ పై కూడా వాట్సాప్ వాడాలనుకొనే వారికి ఇబ్బందులు తప్పవు. అందుకోసం చాలా మంది క్లోన్డ్ యాప్స్ వాడుతుంటారు. అయితే దీనిలో భద్రతా పరమైన సమస్యలు వస్తుంటాయి. లేదా ప్లే స్టోర్ నుంచి పేర్లల్ యాప్స్ ద్వారా మరికొందరు రెండు వాట్సాప్ అకౌంట్లను వాడుతుంటారు. అయితే ఈ కష్టాలకు ఇక వాట్సాప్ యాజమాన్యం చెక్ పెట్టింది. ఒకే ఫోన్లో, ఒకే వాట్సాప్ లో రెండు అకౌంట్లను వినియోగించుకునే వెసులు బాటును కల్పించింది. వాట్సాప్ కొత్త ఫీచర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వినియోగదారుల అవసరాలకు పెద్ద పీట..

వాట్సాప్ వినియోగదారుల అవసరాలకు పెద్ద పీట వేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. అందుకే రోజురోజుకీ దాని వినియోగదరుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే లాక్ చాట్, స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్ వంటి అత్యాధునిక ఫీచర్లను వినియోగదారులకు అందించిన వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాబీటా ఇన్ ఫో ప్రకారం దానిపేరు వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్. ఈ ఫీచర్ సాయంతో మీరు ఒకే ఫోన్లోని యాప్ లో రెండు అకౌంట్లను వాడుకోవచ్చు.

కొత్త ఫీచర్ ఇలా..

ఈ కొత్త ఫీచర్ కోసం వాట్సాప్ ప్రోఫైల్ సెట్టింగ్స్ ను రిడిజైన్ చేశారని వాబీటా ఇన్ ఫో రిపోర్టు చెబుతోంది. దీని సాయంతో వినియోగదారులు తమ చాట్ లను ఒకే యాప్‌తో బహుళ ఖాతాల నుంచి నిర్వహించుకోవడానికి కూడా అనుమతిస్తుంది. అదనంగా, ఇది సంభాషణలు, నోటిఫికేషన్‌లను వేరుగా ఉంచుతుంది. విభిన్న పరికరాలు లేదా పేర్లల్ యాప్‌ల అవసరం లేకుండా ఒకే పరికరంలో ఖాతాల మధ్య మారడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ మీరు పొందడానికి వాట్సాప్ బీటా లేటెస్ట్ అప్ డేట్ ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి మల్టీ అకౌంట్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవడమే. అయితే ఇది కేవలం కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న కాలంలో అందరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇటీవల వచ్చిన కొత్త ఫీచర్..

మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్ గ్రేడ్లు తీసుకొస్తూనే ఉన్నారు. ఇటీవల మ్యాక్ యూజర్ల కోసం గ్రూప్ కాలింగ్ ఫీచర్‌తో కొత్త వాట్సాప్ అప్లికేషన్‌ను విడుదల చేశారు. ఇది వీడియో కాల్‌లలో ఎనిమిది మంది వ్యక్తులతో.. ఆడియో కాల్‌లలో 32 మంది వ్యక్తులతో కనెక్ట్ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భార్య ఫొటోలు డిలీల్ చేసిన చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చాడా?
భార్య ఫొటోలు డిలీల్ చేసిన చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చాడా?
రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!
రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..