Voter ID: మీ ఓటర్ ఐడీలో పేరు తప్పుగా ఉందా? ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా మార్చుకోండి..

ఓటరు ఐడీలో పేరు తప్పుగా ఉంటే ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్‌లైన్‌లోనే ఈజీగా ఛేంజ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పేరును ఎలా మార్చుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా నేమ్ ఛేంజ్ చేసుకోవచ్చు.

Voter ID: మీ ఓటర్ ఐడీలో పేరు తప్పుగా ఉందా? ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా మార్చుకోండి..
Name Change In Voter Id

Updated on: Aug 14, 2025 | 7:32 AM

ఓటర్ ఐడీ కార్డు కేవలం ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే కాకుండా అనేక ప్రభుత్వ, ఆర్థిక లావాదేవీలకు ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి ముఖ్యమైన వివరాలు ఈ కార్డులో ఉంటాయి. అయితే కొన్నిసార్లు దరఖాస్తు చేసేటప్పుడు లేదా కార్డును జారీ చేసేటప్పుడు జరిగిన పొరపాట్ల వల్ల మీ పేరు తప్పుగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో సులభంగా మీ పేరును సరిదిద్దుకోవచ్చు. దీని కోసం మీరు ఫారం 8ను ఫిల్ చేయాల్సి ఉంటుంది.

ఫామ్ 8 అంటే ఏమిటి?

ఓటర్ జాబితాలో మీ వివరాలను సరిదిద్దడానికి లేదా మార్పులు చేయడానికి ఉపయోగించే దరఖాస్తు ఫామే ఫారం 8. ఈ ఫారం ద్వారా మీరు మీ నివాసం మార్పు, పేరు, వయస్సు, ఫోటో లేదా ఇతర వివరాలను మార్చుకోవచ్చు. ఈ ఫామ్‌ను పొందేందుకు మీరు ఎన్నికల సంఘం యొక్క అధికారిక పోర్టల్ అయిన https://voters.eci.gov.in/ కు వెళ్లాలి.

ఆన్‌లైన్‌లో పేరు మార్చుకునే ప్రక్రియ:

పోర్టల్‌లోకి వెళ్లండి: ముందుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ https://voters.eci.gov.in/ ను సందర్శించండి.

లాగిన్ అవ్వండి: మిమ్మల్ని మొబైల్ నంబర్‌ను నమోదు చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ ఓటరు ఐడీ కార్డ్‌తో లింక్ ఉన్న నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసి ధృవీకరించండి.

లాగిన్ అయిన తర్వాత మీరు ఓటరు ఐడీ కార్డ్ నంబర్‌ను నమోదు చేయమని అడుగుతుంది. మీరు ఓటరు ఐడీ కార్డును ఎంటర్ చేసిన చేసిన వెంటనే మీ వివరాలు కనిపిస్తాయి. దీని తర్వాత మీరు ఓటరు ఐడీలో ఏ మార్పులు చేయాలనుకుంటున్నారో అడుగుతుంది. కరెక్షన్ ఎంట్రీ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఫామ్ 8 మీ తెరుచుకుంటుంది. దీనిలో మీరు ముఖ్యమైన వివరాలను నమోదు చేయాలి.

ఈ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి అవసరం

ఆధార్ కార్డు

బ్యాంక్ పాస్‌బుక్

పాస్‌పోర్ట్

పాన్ కార్డు

డ్రైవింగ్ లైసెన్స్

బర్త్ సర్టిఫికెట్

విద్యుత్ లేదా గ్యాస్ బిల్లు

టెన్త్ లేదా ఇంటర్ మెమో

అన్ని వివరాలు, పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత వాటిని ఒకసారి సరిచూసుకుని, సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

ట్రాకింగ్: దరఖాస్తును సమర్పించిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దీని ద్వారా మీరు మీ దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయవచ్చు.

ఈ ప్రక్రియ ద్వారా మీరు మీ ఓటర్ ఐడీ కార్డులో పేరును సులభంగా మార్చుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..