స్మార్ట్ వాచ్ ప్రస్తుతం ట్రెండీ గ్యాడ్జెట్ గా మారింది. అందులో వస్తున్న స్మార్ట్ ఫీచర్లు, హెల్త్ ట్రాకర్లు, అధునాతన సౌకర్యాలు అందరినీ వాటివైపు ఆకర్షిస్తున్నాయి. అందుకే అందరూ వాటిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో ఉన్న ఈ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. కొత్త ఉత్పత్తులను, తక్కువ ధరలో అధిక ఫీచర్లతో లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఓ కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. ఈ-సిమ్ టెక్నాలజీతో వస్తున్న ఈ వాచ్ పేరు వివో వాచ్3. దీనిలో అత్యాధునిక హెల్త్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
వివో వాచ్ 3 నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లాక్, బ్రైట్ మూన్, మూన్‌లైట్ వైట్ స్టార్‌లైట్ రంగుల్లో మీకు నచ్చని కలర్లో దీనిని కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం చైనాలో మాత్రమే ఈ వాచ్ విక్రయానికి ఉంది. ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. వివో వెబ్ సైట్లోకి వెళ్లి ప్రీ బుక్ చేసుకోవచ్చు. నవంబర్ 21 నుంచి అధికారికంగా విక్రయాలు ప్రారంభమవుతాయి.
సాఫ్ట్ రబ్బర్ స్ట్రాప్ తో వచ్చే బ్లూటూత్ వాచ్ ధర CNY 1,099 (దాదాపు రూ. 12,600)గా ఉంది.
లెదర్ స్ట్రాప్ తో వచ్చే బ్లూటూత్ వాచ్ ధర CNY 1,199 (దాదాపు రూ. 13,700)గా ఉంటుంది.
సాఫ్ట్ రబ్బర్ స్ట్రాప్ తోపాటు ఈ-సిమ్ సపోర్టుతో వచ్చే వాచ్ దర CNY 1,299 (దాదాపు రూ. 14,900)గా ఉంది.
లెదర్ స్ట్రాప్ తో పాటు ఈ-సిమ్ సపోర్టుతో వచ్చే వాచ్ ధర CNY 1,399 (దాదాపు రూ. 16,000)గా ఉంది.
వివో వాచ్3 1.43-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత నిల్వతో వస్తుంది. వివో సొంత బ్లూఓఎస్ తో వస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ జోవి అసిస్టెంట్‌ని కలిగి ఉంది. 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది మీ ఆరోగ్యం, నిద్ర విధానాలను కూడా ట్రాక్ చేస్తుంది. హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్ పర్యవేక్షణ కోసం ఆరోగ్య సెన్సార్ ఉంటుంది. ఈ వాచ్3 బ్యాటరీ లైఫ్ ఆకట్టుకుంటుంది. ఈ-సిమ్ మోడల్ రోజులు, బ్లూటూత్ వెర్షన్ 16 రోజుల వరకూ బ్యాటరీ ఉంటుంది. ఈ వాచ్ కనెక్టివిటీ ఫీచర్ల కోసం ఈ-సిమ్, బ్లూటూత్ 5.2 ఎల్ఈ, జీపీఎస్, గ్లోనాస్, గలిలియో, బీడో, ఎన్ఎఫ్సీ ద్వారా మద్దతు ఇస్తుంది. ఇది 5ఏటీఎం వరకు నీటి-నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది వివిధ వాతావరణాలలో మన్నికైనదిగా చేస్తుంది. వాచ్ వాయిస్ కాలింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..