Malware: పెరుగుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లోకి మాల్వేర్‌లను పంపిస్తూ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే రకరాల మాల్వేర్‌లు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే గ్యాడ్జెట్లపై ఇటీవల మాల్వేర్‌ల దాడి పెరిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్స్‌ను టార్గెట్ చేస్తూ మాల్వేర్‌లను పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
ఈ క్రమంలోనే గూగుల్ ఎప్పటికప్పుడు మాల్వేర్‌లతో కూడిన యాప్‌లను గుర్తిస్తూ యూజర్లను అలర్ట్ చేస్తుంటుంది. పలానా యాప్స్‌లో మాల్వేర్‌లు చొరబడ్డాయని వాటిని వెంటనే మొబైల్ నుంచి డిలీట్ చేసుకోండని సూచిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా గూగుల్ 8 యాప్‌లను విడుదల చేసింది. ఈ యాప్‌లతో యూజర్ల వ్యక్తిగత డేటా భద్రతకు భంగం కలుగుతుందని చెబుతున్నారు. ఇంతకీ గూగుల్ తెలిపిన ఆ 8 యాప్స్ ఏంటంటే..
* వ్లోగ్ స్టార్ వీడియో ఎడిటర్ (1 మిలియన్ డౌన్‌లోడ్స్)
* క్రియేటివ్ 3డీ లాంచర్ (1 మియిలన్ డౌన్‌లోడ్స్)
* వావ్ బ్యూటీ కెమెరా (లక్ష డౌన్‌లోడ్స్)
* జిఫ్ ఎమోజీ కీబోర్డ్ (లక్ష డౌన్‌లోడ్స్)
* రేజర్ కీబోర్డ్ అండ్ థీమ్ (10000 డౌన్‌లోడ్స్)
* ఫ్రీగ్లో కెమెరా 1.0.0 (5000 డౌన్‌లోడ్స్)
* కోకో కెమెరా వీ1.1 (1000 డౌన్‌లోడ్స్)
* ఫన్నీ కెమెరా బై కెల్లీ టెక్ (50,000 డౌన్‌లోడ్స్)
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..