ట్విటర్‌లో రిపోర్ట్‌ ఆప్షన్…

| Edited By:

Apr 25, 2019 | 1:35 PM

ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ తన ఖాతాదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లను తప్పుతోవ పట్టించేలా ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే రిపోర్ట్‌ చేయగలిగేలా ఈ ఫీచర్‌ను రూపొందించింది. ఎన్నికల్లో త‌ప్పుడు స‌మాచారాన్ని ప్రచారం చేసే విధంగా ఉన్న ట్వీట్లు క‌నిపిస్తే వాటిపై రిపోర్ట్ చేయ‌వ‌చ్చు. అందుకు గాను యాప్ లేదా డెస్క్‌టాప్‌లో స‌ద‌రు ట్వీట్ల‌ కింద ఉండే డ్రాప్ డౌన్ మెనూను ఓపెన్ చేయాలి. అందులో రిపోర్ట్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. […]

ట్విటర్‌లో రిపోర్ట్‌ ఆప్షన్...
Follow us on

ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ తన ఖాతాదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లను తప్పుతోవ పట్టించేలా ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే రిపోర్ట్‌ చేయగలిగేలా ఈ ఫీచర్‌ను రూపొందించింది. ఎన్నికల్లో త‌ప్పుడు స‌మాచారాన్ని ప్రచారం చేసే విధంగా ఉన్న ట్వీట్లు క‌నిపిస్తే వాటిపై రిపోర్ట్ చేయ‌వ‌చ్చు. అందుకు గాను యాప్ లేదా డెస్క్‌టాప్‌లో స‌ద‌రు ట్వీట్ల‌ కింద ఉండే డ్రాప్ డౌన్ మెనూను ఓపెన్ చేయాలి. అందులో రిపోర్ట్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఎంచుకుని.. అనంత‌రం వ‌చ్చే విండోలో ఆ ట్వీట్ ఏవిధంగా త‌ప్పుదోవ ప‌ట్టిస్తుందో, అది యూజ‌ర్ల‌ను ఎలా ప్ర‌భావితం చేస్తుందో కామెంట్ ఎంట‌ర్ చేసి కింద ఉండే స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. దీంతో అలాంటి త‌ప్పుదోవ ప‌ట్టించే ట్వీట్లు ట్విట్ట‌ర్‌కు రిపోర్ట్ వెళ్తుంది. అప్పుడు టీం అందుకు స్పందించి.. వాటిని పరిశీస్తుంది. నిజంగానే అవి త‌ప్పుదోవ ప‌ట్టించేవిగా , త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసేవిగా ఉంటే వాటిని వెంట‌నే తొల‌గిస్తారు. అంతేకాదు వారి అకౌంట్లను కూడా బ్లాక్ చేస్తారు.