Tiktok Kitchen: ఫుడ్ డెలివరీ సేవల్లోకి టిక్‌టాక్.. యాప్‌లో వైరల్ అయిన ఫుడ్ వీడియోలే మెనూ..
Tiktok Kitchen: టిక్‌టాక్ యాప్‌కు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. షార్ట్ వీడియో ప్లాట్‌ఫాంలో ఓ సంచలనంగా దూసుకొచ్చిందీ యాప్. ఇప్పుడైతే..
Tiktok Kitchen: టిక్‌టాక్ యాప్‌కు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. షార్ట్ వీడియో ప్లాట్‌ఫాంలో ఓ సంచలనంగా దూసుకొచ్చిందీ యాప్. ఇప్పుడైతే మన దగ్గర నిషేధానికి గురైంది కానీ.. ఒకప్పుడు మాత్రం భారత్‌లో ఈ యాప్ ఒక సంచలనం. ఈ యాప్ ద్వారా ఎంతో మంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారారు. ఇదిలా ఉంటే తాజాగా టిక్‌టాక్ మరో కొత్త పంథా ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నెటిజన్లను వీడియోలతో ఎంటర్‌టైన్ చేసిన టిక్‌టాక్ ఇప్పుడు ఫుడ్‌తో అట్రాక్ట్ చేయనుంది. 2022 కల్లా అమెరికాలో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు టిక్‌టాక్ సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ విషయమై టిక్‌టాక్ కిచన్ పేరుతో ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిందని సమాచారం.
అమెరికాలోని సుమారు 300 ప్రాంతాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫుడ్ డెలివరీలో టిక్‌టాక్ ప్రత్యేక మెనూను అందుబాటులోకి తేనుంది. సాధారణంగా టిక్‌టాక్‌లో వైరల్ అయ్యే వీడియోస్‌లో ఫుడ్ సంబంధిత వీడియోలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కొందరు ఔత్సాహికులు విభిన్నమైన వంటకాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇవి బాగా వైరల్ అవుతుంటాయి కూడా. అయితే టిక్‌టాక్ తమ ఫుడ్ బిజినెస్‌లో ఈ వైరల్ వీడియోల్లో ఉన్న ఫుడ్‌నే మెనూగా మార్చనుంది.
ఇప్పటి వరకు టిక్‌టాక్‌లో వైరల్ అయిన కార్న్ రిబ్స్, బేక్డ్ ఫెటా పాస్తా, స్మాష్ బర్గర్, పాస్తా చిప్స్‌తో పాటు మరిన్ని విభిన్న వంటకాలను కస్టమర్లకు అందించనున్నారు. ఇక వైరల్ అయిన ఫుడ్ డిషెస్‌కు వాటిని పోస్ట్ చేసిన వారికి టిక్‌టాక్ క్రెడిట్ అందించనున్నట్లు. మరి టిక్‌టాక్ ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను తీసుకొస్తుందా.? లేదా టిక్‌టాక్‌లోనే నేరుగా ఫుడ్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుందో చూడాలి.
రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ టోపీ.. ఈ మోసానికి పాల్పడింది ఓ మాజీమంత్రి బంధువు..
Health Problems: నిద్రలేమి సమస్యతో ఎన్నో అనర్థాలు.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు..!