Tech News: త్రీ పిన్ ప్లగ్‌లో పైన ఉన్న పిన్‌ పొడవుగా, లావుగా ఎందుకు ఉంటుందో తెలుసా? చాలా మందికి తెలియని సీక్రెట్‌!

Three-Pin Plug Safety: త్రీ పిన్ ప్లగ్‌లోని పైన ఉండే పెద్ద పిన్, అంటే ఎర్త్ పిన్, మీ భద్రతకు అత్యవసరం. ఇది మిగతా పిన్‌ల కంటే ముందే పరికరానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మిగతా రెండు పిన్‌ల కంటే పొడవుగా, లావుగా ఎందుకు ఉంటుందోనని మీరెప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక రహస్యం ఎంతో ఉంది. ఇది కేవలం డిజైన్‌ కోసం కాదు. మన ప్రాణాలను రక్షించే పిన్‌.

Tech News: త్రీ పిన్ ప్లగ్‌లో పైన ఉన్న పిన్‌ పొడవుగా, లావుగా ఎందుకు ఉంటుందో తెలుసా? చాలా మందికి తెలియని సీక్రెట్‌!
Three Pin Plug

Updated on: Feb 17, 2026 | 3:08 PM

Tech News: త్రీ పిన్ ప్లగ్‌లోని పైన ఉండే పిన్ మిగతా రెండు పిన్‌ల కంటే పెద్దగా, లావుగా ఉండటాన్ని మీరు గమనించి ఉండవచ్చు. ఇది కేవలం డిజైన్ కోసం కాదు, దీని వెనుక ఒక ముఖ్యమైన ఇంజనీరింగ్ భద్రతా సిద్ధాంతం ఉంది. ఈ పొడవైన పిన్‌ను ఎర్త్ పిన్ అంటారు. మిగతా రెండు పిన్‌లు విద్యుత్ సరఫరాను అందిస్తాయి. సాధారణంగా రిఫ్రిజిరేట్లకు, ఏసీ, టీవీ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులకు ఈ పిన్ తో కూడిన ప్లగ్ ఉండటం అందరికి తెలిసిందే.

మనం ప్లగ్‌ను సాకెట్‌లో పెట్టినప్పుడు ఈ ఎర్త్ పిన్ పొడవుగా ఉండటం వల్ల మిగతా రెండు పిన్‌ల కంటే ముందుగా సాకెట్‌లోకి వెళ్లి కనెక్షన్ ఏర్పరుస్తుంది. దీనివల్ల విద్యుత్ సరఫరా ప్రారంభం కాకముందే పరికరానికి అర్తింగ్ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఆ ఎలక్ట్రానిక్ వస్తువులో ఏదైనా లోపం ఉండి, విద్యుత్ సరఫరా అయినట్లయితే మనం ఆ పరికరాన్ని తాకినప్పుడు షాక్ తగలకుండా, ఆ కరెంట్ నేరుగా భూమిలోకి వెళ్లిపోతుంది.

ఇది కూడా చదవండి: Multibagger: కలిసొచ్చిన కాలం.. రూ. 1 లక్ష పెట్టుబడి 22 నెలల్లోనే రూ.6 కోట్లు..!

ఇవి కూడా చదవండి

అలాగే ప్లగ్‌ను సాకెట్ నుండి తీసేటప్పుడు కూడా కరెంట్ సరఫరా చేసే పిన్‌లు బయటికి వచ్చిన తర్వాతే చివరిగా ఈ ఎర్త్ పిన్ బయటికి వస్తుంది. ఈ జాగ్రత్తలన్నీ మన ప్రాణాలను విద్యుత్ ప్రమాదాల నుండి కాపాడటానికి ఉద్దేశించినవి. అందువల్ల త్రీ పిన్ ప్లగ్ డిజైన్ కేవలం డిజైన్‌ కోసమో.. ఇంకా దేనికోసమో కాకుండా వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.

ఇది కూడా చదవండి: Rental Agreement: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు? అసలు సీక్రెట్‌ ఇదే!

Follow Us