Ground Beetle: సాధారణంగా కీటకాల్లో ఎన్నో జాతులుంటాయి. అందులో కొన్ని విషకీటకాలు కూడా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కీటకం గురించి వింటే నోరెళ్లబెడతారు. ఎందుకంటే ఈ కీటకంపై ఎవరైనా దాడి చేయాలని చూస్తే బాంబులేస్తుంది. ఫలితంగా మరే ఇతర జీవి దీన్ని వేటాడడానికి సాహసించదు. దాని పేరే గ్రౌండ్ బీటిల్. ఇతర జీవుల దాడుల నుంచి తప్పించుకునేందుకు దీనికి ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటుంది. అందుకే దీనికి బాంబార్డియర్ బీటిల్ అని పిలుస్తుంటారు. అంటార్కిటికా మినహా భూమిపై ఉన్న అన్ని ఖండాల్లోనూ ఈ కీటకానికి సంబంధించి 500 జాతులున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరి ఈ కీటకం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
ఈ కీటకం శరీరంపై పెంకులాంటి నిర్మాణం ఉంటుంది. ఏవైనా జీవులు దాడిచేసేందుకు వచ్చినప్పుడు ఇది అన్ని కీటకాల్లాగా వెంటనే గాల్లోకి ఎగరలేదు. తనను తాను రక్షించేందుకు రసాయన బాంబులను వదులుతుంది. వీటికారణంగా మరే ఇతర జీవి దీన్ని వేటాడడానికి సాహసించదు. ఈ కీటకం కడుపులోనే విషపూరిత వాయువులుంటాయట. శరీరంలో ఉండే రెండు వేర్వేరు గ్రంథులనుంచి ఆక్సిజన్, హైడ్రోక్వినోన్ అనే వాయువులు విడుదలవుతాయి. ఇవి రెండూ కలిసి అతి ప్రమాదకరమైన బెంజోక్వినోన్‌గా మారుతుంది. ఈ డేంజరస్ బీటిల్ ఒకేసారి 20 సార్లు రసాయనిక వాయువులను విడుదల చేస్తుంది. అవి వాతావరణంలోని ఉష్ణోగ్రతతో కలిసిపోయి బాంబుల్లాగా పాప్ అనే శబ్ధం చేస్తూ విడుదలవుతాయి. ఇది ఇతర జీవులకు చికాకు తెప్పించడంతో పాటు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఈ కీటకంపై దాడి చేసేందుకు ఇతర జీవులు వెనక్కు జంకుతాయి.
Predators be warned! The bombardier beetle has an explosive defense. It mixes chemicals w/ catalysts in the rear of its abdomen, producing a chemical reaction that blasts out a noxious spray at 212°F! It even detonates after being gulped to be thrown back up to live another day. pic.twitter.com/RzjMnVb8oh
— American Museum of Natural History (@AMNH) March 24, 2018
Also Read: Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..
Lic Policy: ఎల్‌ఐసీ సూపర్ ప్లాన్.. ప్రతిరోజు రూ.73 డిపాజిట్ చేస్తే.. 10 లక్షలు మీవే..!
AP Crime: ప్రేమించిన యువతి ఫోన్ ఎత్తట్లేదని.. ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు