Smartphone: ఫోన్ మీ చేతిలో ఉంటే ఇక డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు..
రోజురోజుకు సాంకేతిక అభివృద్ధి చెందడంతో అనేక మార్పులు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన స్మార్ట్ ఫోన్ అందరి జీవితాల్నే మార్చేసింది. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం ఒకనొకరు మాట్లాడుకోవడానికే మాత్రమే సదుపాయం ఉండేది. ఆ తర్వాత రాను రాను ఇంటర్నెట్ యుగం వచ్చాక ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది.
రోజురోజుకు సాంకేతిక అభివృద్ధి చెందడంతో అనేక మార్పులు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన స్మార్ట్ ఫోన్ అందరి జీవితాల్నే మార్చేసింది. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం ఒకనొకరు మాట్లాడుకోవడానికే మాత్రమే సదుపాయం ఉండేది. ఆ తర్వాత రాను రాను ఇంటర్నెట్ యుగం వచ్చాక ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అసలు స్మార్ట్‌ఫోన్ వాడందే ఒక్కరోజు కాదు కదా.. రెండు మూడు గంటలు కూడా ఉండలేకపోతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాఫ్, యూట్యూబ్ లాంటి వాటిని చూసేందుకే ఎక్కవగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్ వల్ల ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోవడం, గూగల్ మ్యాప్స్ ద్వారా మనకు కావాల్సిన చోటుకి వెళ్లడం, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఇలా ఎన్నోరకాల సౌకర్యాలు కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో మరో కొత్త ఆవిష్కరణ రాబోతుంది.
ప్రస్తుతం జ్వరాన్ని కొలిచేందుకు థర్మామీటర్‌ను వినియోగిస్తున్నారు. కానీ ఇప్పుడు దాని స్థానంలో స్మార్ట్‌ఫోన్‌నే వాడుకోవచ్చు. ఇందుకు సంబంధించిన యాప్‌ను పరిశోధకులు తయారు చేస్తున్నారు. ఈ యాప్‌ను ఒపెన్ చేసి అందులో కనిపించే కెమెరా లెన్స్ ఆప్షన్‌తో రోగి నుదుటి దాదాపు 90 సెకండ్ల పాటు ఉంచితే చాలు. జ్వరం ఎంత ఉందో అనేది ఇట్టే తెలిపోతుంది. మొదటగా 37 మంది రోగులపై ఈ యాప్‌ను పరిశీలించగా.. ప్రాథమిక దశలో ఫలితాలు అనుకూలంగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. అలాగే ఈ యాప్ ఇంకా టెస్టింగ్ దశలో ఉందని.. కొన్ని వైద్య క్లియరెన్సులు పూర్తయ్యాక ఇది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..