Artificial Rain: కృత్రిమ వర్షాన్ని కురిపించేలా మరో కొత్త సాంకేతికతను తయారుచేసిన పరిశోధకులు
కొద్దిగా ఆలోచిస్తే చాలు అనుకున్నవి సాధించే సత్తా మానవులకు మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు ఏ సౌకర్యాలు లేని మానవుడు నేడు డిజిటల్ యుగంలో తనకు కావాల్సిన అనేక సదుపాయాలు పొందుతున్నాడు. రెండు చక్రాల బండి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు, ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకు, బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంటి హెచ్‌డీ టీవీల వరకు ఇలాంటి అనేక ఆవిష్కరణలు మానవుల జీవితాలనే మార్చేశాయి.
కొద్దిగా ఆలోచిస్తే చాలు అనుకున్నవి సాధించే సత్తా మానవులకు మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు ఏ సౌకర్యాలు లేని మానవుడు నేడు డిజిటల్ యుగంలో తనకు కావాల్సిన అనేక సదుపాయాలు పొందుతున్నాడు. రెండు చక్రాల బండి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు, ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకు, బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంటి హెచ్‌డీ టీవీల వరకు ఇలాంటి అనేక ఆవిష్కరణలు మానవుల జీవితాలనే మార్చేశాయి. మరో విషయం ఏంటంటే గతంలో వర్షాన్ని కూడా కృత్రిమంగా కురిపించేలై టెక్నాలజీని కూడా కనుగొన్నారు. అయితే తాజాగా ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పరిశోధకులు సైతం అలాంటి అద్భతమే మరొకటి చేశారు.
క్లూడ్ సీడింగ్ అనే సాంకేతికత ద్వారా కృత్రిమంగా వర్షాన్ని కురిపించేలా ప్రయోగం చేశారు. అంతేకాదు ఆ పరీక్షలో కూడా విజయవంతం అయ్యారు. అయితే ఏవియేషన్ అధికారుల వల్ల టెస్టింగ్ విమానం గాల్లోకి ఎగిరింది. సమారు 5 వేల అడుగుల పైకి వెళ్లాక క్లౌడ్ సీడింగ్‌తో వాతావరణంలో మార్పులు చేసేలా రసాయనాలను చల్లారు. మరో విషయం ఏంటంటే దాని వల్ల కృత్రిమంగా వర్షం కూడా పడింది. అయితే కరవులు ఉన్న ప్రాంతాల్లో ఈ సాంకేతికత ద్వారా కృత్రిమంగా వర్షాలు కరిపించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..