Telugu News Technology These are tips from NASA to take picture of solar eclipse, check the details in telugu
Solar Eclipse: సూర్యుడిని ఆ సమయంలో ఫొటో తీయడం ప్రమాదకరం.. నాసా వెల్లడించిన కీలక విషయాలు ఇవి..
సూర్యగ్రహణం ఫొటోలు తీయడం వల్ల స్మార్ట్‌ఫోన్ కెమెరా దెబ్బతింటుందని నాసా తెలిపింది. ప్రజలు తమ ఫోన్లను నేరుగా చూపించకూడదు. దానివల్ల సెన్సార్ డ్యామేజ్ అవుతుంది. ఈ విషయంపై పలువురు అడిగిన ప్రశ్నలకు తన ఎక్స్ ఖాతాలో సమాధానాలను పోస్ట్ చేసింది. నిపుణుల ద్వారా పలు విషయాలను వెల్లడించింది.
సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లతో ఆ చిత్రాలను ఫొటోలు తీస్తుంటారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తారు. ఇలా చేయడం వారి హాబీ అయినప్పటికీ కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కెమెరాలోని లెన్స్ పాడైపోతాయి. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. ప్రస్తుతం వివిధ రకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఫీచర్లు కలిగిన వీటిని ఉపయోగించి స్పష్టమైన ఫొటోలు తీయవచ్చు. ముఖ్యంగా కెమెరా ఫిక్సల్ చాలా మెరుగుగా ఉంటుంది. సూర్యగ్రహణం సమయంలో వీటితో ఫొటోలు తీస్తే కెమెరాలోని సెన్సార్లు దెబ్బతినే అవకాశం ఉంది.
నేడు సూర్యగ్రహణం..
సూర్యగ్రహణం ఏప్రిల్ 8న (సోమవారం) ఏర్పడనుంది. ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆసియా ఖండలో దీని ప్రభావం ఉండదు. అంటే మనదేశంలో అస్సలు కనిపించదు. సూర్యగ్రహణం ఫొటోలు తీయడం వల్ల స్మార్ట్‌ఫోన్ కెమెరా దెబ్బతింటుందని నాసా తెలిపింది. ప్రజలు తమ ఫోన్లను నేరుగా చూపించకూడదు. దానివల్ల సెన్సార్ డ్యామేజ్ అవుతుంది. ఈ విషయంపై పలువురు అడిగిన ప్రశ్నలకు తన ఎక్స్ ఖాతాలో సమాధానాలను పోస్ట్ చేసింది. నిపుణుల ద్వారా పలు విషయాలను వెల్లడించింది. సూర్యగ్రహణాన్ని ఫొటోలు తీయడం వల్ల ఫోన్ సెన్సార్ దెబ్బతింటుంది.
సూర్యగ్రహణాన్ని ఫొటోలు తీసినా స్మార్ట్‌ఫోన్ కెమెరాలకు హాని కలగకుండా ఉండే పలు చిట్కాలను నాసా తెలియజేసింది.
గ్రహణం సమయంలో సూర్యుడిని ఫొటోలు తీసేటప్పుడు మీ ఫోన్ లెన్స్ ముందు ఒక జత ఎక్లిప్స్ గ్లాసెస్ పట్టుకోవాలి.
సూర్యగ్రహణాన్ని వీక్షించేటప్పుడు మీ భద్రత కూడా చాలా ముఖ్యం. మీ కళ్లు, కెమెరాను రక్షించడానికి ప్రత్యేక సోలార్ ఫిల్టర్లను ఉపయోగించాలి. గ్రహణం కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని చూసినప్పుడు ఫిల్టర్‌ను పూర్తిగా తొలగించవచ్చు.
గ్రహణం ఫొటోలు తీయడానికి ఖరీదైన కెమెరా అవసరం లేదు. కానీ ఫొటోగ్రాఫర్ నైపుణ్యం ఉండాలి. స్పష్టమైన చిత్రాల కోసం త్రీపోర్డ్ ను ఉపయోగించండి. మీకు టెలిఫొటో జూమ్ లెన్స్ లేకపోతే మారుతున్న వాతావరణాన్ని చిత్రీకరించడంపై దృష్టి పెట్టండి.
గ్రహణం సమయంలో సూర్యుడి వైపు మాత్రమే కాకుండా చుట్టూ చూడండి. ఆ సమయంలో ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది. చెట్లు తదితర వాటిని కూడా ఫొటోలు తీయవచ్చు.
గ్రహణం రోజు ముందు మీ కెమెరాను ఉపయోగించడం ప్రాక్టీస్ చేయండి. సరైన లైటింగ్ కోసం ఎక్స్‌పోజర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయండి. గ్రహణాన్ని చిత్రీకరించడం కోసం వివిధ షట్టర్ వేగం, ఎపర్చర్‌లను పరీక్షించండి.
సూర్యగ్రహణాన్ని, మీ స్వంత కళ్లతో గ్రహణాన్ని మీ కళ్లతో చూసి ఆస్వాదించాలనుకుంటే మాత్రం భద్రత కోసం సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్ ధరించాలి.