Washing Machines: మొండి మరకలను మాయం చేసే వాషింగ్ మెషీన్‌లు ఇవే.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు

|

Jul 16, 2024 | 8:20 PM

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది తప్పనిసరి వస్తువుగా మారింది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ కల్చర్ అధికంగా ఉన్న పట్టణాల్లో కచ్చితంగా వాషింగ్ మెషీన్ ఉండాల్సి వస్తుంది. అయితే వాషింగ్ మెషీన్‌లో ఉతికిన బట్టలు చేతితో ఉతికనంత తెల్లగా రావని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మారుతున్న టెక్నాలజీకు అనుగునంగా చేతితో ఉతికినంత ఫీల్ ఇచ్చేలా సూపర్ వాషింగ్ మెషీన్లను కంపెనీలు మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి.

Washing Machines: మొండి మరకలను మాయం చేసే వాషింగ్ మెషీన్‌లు ఇవే.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు
Washing Machine
Follow us on

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది తప్పనిసరి వస్తువుగా మారింది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ కల్చర్ అధికంగా ఉన్న పట్టణాల్లో కచ్చితంగా వాషింగ్ మెషీన్ ఉండాల్సి వస్తుంది. అయితే వాషింగ్ మెషీన్‌లో ఉతికిన బట్టలు చేతితో ఉతికనంత తెల్లగా రావని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మారుతున్న టెక్నాలజీకు అనుగునంగా చేతితో ఉతికినంత ఫీల్ ఇచ్చేలా సూపర్ వాషింగ్ మెషీన్లను కంపెనీలు మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. ముఖ్యంగా మొండి మరకలను పొగొట్టాలంటే కచ్చితంగా వేడి నీటితో ఉతకాలనే విషయంలో అందరికీ తెలుసు. అయితే ఈ వాషింగ్ మెషీన్స్‌ ఇన్‌బుల్ట్ వాటర్ హీటర్ ఫీచర్‌తో మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తక్కువ ధరకే అధునాతన ఫీచర్లతో ఏయే వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

ఎల్‌జీ 7 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్

వాషింగ్ మెషీన్స్ విభాగంలో ఎల్‌జీ కంపెనీ వాషింగ్ మెషీన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఏడు కేజీల వాషింగ్ మెషీన్ విభాగంలో మధ్య తరగతి ప్రజలకు అనువుగా తక్కువ కరెంట్‌తో పని చేసే 5 స్టార్ రేటింగ్‌ వాషింగ్ మెషీన్ ఇటీవల మహిళలను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ 10 వాష్ ప్రోగ్రామ్‌లు, 1200 ఆర్‌పీఎం స్పిన్ స్పీడ్‌తో వస్తుంది. 6 మోషన్ డైరెక్ట్ డ్రైవ్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషిన్ ధర రూ. 28,990గా ఉంది. 

సామ్‌సంగ్ 9 కేజీ ఇన్వర్టర్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్

సామ్‌సంగ్ కంపెనీ గృహోపకరణాల విషయంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. 9 వాష్ ప్రోగ్రామ్‌లతో 680 ఆర్‌పీఎం స్పిన్ స్పీడ్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇది డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్‌ను వైఫైతో పాటు సామ్‌సంగ్ యాప్‌తో నియంత్రించవచ్చు. ఎకోబబుల్ వాష్ ప్రోగ్రామ్‌లతో పోలిస్తే 73 శాతం తక్కువ శక్తిని, 19 శాతం తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. ఈ సామ్‌సంగ్ వాషింగ్ మెషిన్ ధర రూ.24,990గా ఉంది. 

ఇవి కూడా చదవండి

వర్ల్‌పూల్ 7 కేజీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్

వర్ల్‌ఫూల్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాషింగ్ మెషిన్ బ్రాండ్‌లలో ఒకటిగా ఉంది. ఏడు కేజీల వర్ల్‌పూల్ వాషింగ్ మెషీన్ చిన్న కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది. 15 వాష్ ప్రోగ్రామ్‌లు, 1000 ఆర్‌పీఎం స్పిన్ స్పీడ్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్‌లో ఇన్‌బిల్ట్ హీటర్ అమర్చారు. ఆరో సెన్స్ సాఫ్ట్ మూవ్ టెక్నాలజీతో వచ్చే ఈ వాషింగ్ మెషిన్ఇంటెలిసెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీతో ఆకట్టుకుటుంది. ఈ వర్ల్‌పూల్ వాషింగ్ మెషిన్ ధర: రూ. 26,990గా ఉంది. 

హెయిర్ 7.5 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్

హెయిర్ 7.5 కేజీల 5 స్టార్ రేటింగ్‌ వాషింగ్ మెషీన్ 780 ఆర్‌పీఎంతో 15 వాష్ ప్రోగ్రామ్‌లతో వస్తుంది. ఇన్‌బిల్ట్ హీటర్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్ వివిధ అవసరాల కోసం 3 హీట్ వాటర్ మోడ్‌లతో వస్తుంది. ముఖ్యంగా మరకలను సమర్థవంతంగా తొలగించే ఫాబ్రిక్‌లోకి లోతుగా చొచ్చుకుపోయే ఓషన్ వేవ్ డ్రమ్‌ ఫీచర్ ఈ వాషింగ్ మెషీన్ ప్రత్యేకత. డ్యుయల్ మ్యాజిక్ ఫిల్టర్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషిన్ ధర రూ. 22,994గా ఉంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..