
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్ గురించి మనందరికీ తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ల కలిగి ఉన్న ప్రతీఒక్కరూ ఎప్పుడో ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూసే ఉంటారు. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన వీడియోలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం యూట్యూబ్ చాలామంది వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూజర్లు యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేసి ఆదాయం కూడా పొందుతున్నారు. అయితే యూట్యూబ్‌లో ఎప్పుడూ ఏవోక వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వీటికి వ్యూస్‌తో పాటు కోట్లాది వ్యూస్, కామెంట్స్ వస్తూ ఉంటాయి. మరి 2025లో యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన వీడియోలు, టాపిక్స్, టాప్ క్రియేటర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
2025లో టాప్ 10 ట్రెండింగ్ అంశాలను యూట్యూబ్ విడుదల చేసింది. స్క్విడ్ గేమ్ గురించి ఎక్కువమంది సెర్చ్ చేయగా.. ఆ తర్వాత సైయారా రెండో స్థానంలో ఉంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ ట్రెండ్ అయిన అంశాల్లో మూడో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత కుంభమేళా ఉంది. ఇక ఐపీఎల్ 2025 ఐదో స్థానంలో, సనమ్ తేరి కసమ్ ఆరో స్థానంలో ఉంది. ఇక ఏడో స్థానంలో తుంగ్టుంగ్టుంగ్సహుర్, ఎనిమిదో స్థానంలో లబుబు, తొమ్మిదో స్థానంలో ఆసియా కప్ ఉన్నాయి. ఇక ట్రెండింగ్ టాపిక్స్ జాబితాలో కెపాప్ డెమోన్‌హంటర్స్ పదో స్థానంలో ఉంది.
ఇక ఇండియాలో టాప్ క్రియేటర్స్ లిస్టులో మిస్టర్ బీస్ట్ టాప్ వన్ పొజిషన్‌లో ఉన్నాడు. ఇక సెజల్ గబా 2వ, KIMPRO మూడు, కేశవ్ శశి వ్లాగ్స్ నాలుగు, తేరా ట్రిగన్ ఐదో స్థానంలో ఉన్నారు. ఇక సిర్ఫ్ శ్రేయాన్ష్ ఆరు, జిదాన్ షాహిద్ అలీ ఏడు, KL BRO బిజు రిత్విక్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఇక టెక్ మాస్టర్ షార్ట్స్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. రాజ్ షమానీ పదో స్థానంలో కొనసాగుతున్నారు.
సయారా, రాను బొంబాయికి రాను, షాకీ, రాంఝన్, తేరీ రాంజోల్ బోలే గి సాంగ్స్ 2025లో టాప్ 5 లిస్టులో ఉన్నాయి.