Battery Life Tips: మీ ఫోన్ బ్యాటరీ వీక్ అయ్యిందా? ఈ టిప్స్ పాటిస్తే లైఫ్ అమాంతం పెరిగిపోతుంది.. ట్రై చేసి చూడండి..
ఫోన్ కొంత కాలం వినియోగించిన తర్వాత బ్యాటరీ త్వరగా అయిపోతుంటుంది. దానికి కారణం బ్యాటరీ పని అయిపోయిందని అందరూ భావిస్తారు. అయితే అదొక్కటే కారణం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ త్వరగా అయిపోడానికి ఇతర సాంకేతిక అంశాలు కూడా కారణం కావచ్చని వివరిస్తున్నారు. మీ ఫోన్లో సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం..
మీ స్మార్ట్ ఫోన్ ఎంత కాస్ట్ లీ అయినా.. దానిలో ఎన్ని ఫీచర్లు ఉన్నా.. బ్యాటరీ సామర్థ్యం సరిగా లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అస్తమాను బ్యాటరీ చార్జ్ చేసుకోవాలంటే విసుగ్గా అనిపిస్తుంది. అందుకే ఫోన్ కొనుగోలు చేసే సమయంలోనే బ్యాటరీ సామర్థ్యాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫోన్ కొంత కాలం వినియోగించిన తర్వాత బ్యాటరీ త్వరగా అయిపోతుంటుంది. దానికి కారణం బ్యాటరీ పని అయిపోయిందని అందరూ భావిస్తారు. అయితే అదొక్కటే కారణం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ త్వరగా అయిపోడానికి ఇతర సాంకేతిక అంశాలు కూడా కారణం కావచ్చని వివరిస్తున్నారు. వీటి గురించి సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. వెంటనే బ్యాటరీ మార్చేస్తుంటారు. అయితే మీ ఫోన్లో కొన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు ఫోన్ సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు ఎక్కువ కాలం వినియోగించుకునే వీలుంటుంది. ఆ అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
స్క్రీన్ బ్రైట్‌నెస్, టైమ్ అవుట్ సెట్టింగ్..
బ్యాటరీ త్వరగా అయిపోడానికి డిస్‌ప్లే ప్రధాన కారణం. అందుకే అధిక బ్రైట్ నెస్ ఉండకుండా.. మీ కళ్ళకు సౌకర్యంగా ఉండే విధంగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను సెట్ చేసుకోవాలి. ఫోన్ బ్రైట్‌నెస్‌ని అనవసరంగా ఎక్కువగా ఉంచకూడదు. ఆటో-లాక్ లేదా స్క్రీన్ టైమ్ అవుట్ సెట్టింగ్‌లను మార్చండి. ఇది మీ ఫోన్ బ్యాటరీ జీవితాన్నిపెంచుతుంది.
బ్యాక్‌గ్రౌండ్ యాప్ బ్లాక్..
బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు తరచుగా ఫోన్‌లలో రన్ అవుతూ ఉంటాయి. ఇవి మీ ఫోన్ బ్యాటరీని పాడు చేస్తాయి. అటువంటి బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి. అలాగే, నిరంతరం అప్‌డేట్ అయ్యే యాప్‌లను బ్లాక్ చేయాలి. దీని కోసం ఫోన్ “సెట్టింగ్‌లు”కి వెళ్లి, ఆపై “జనరల్” ఎంచుకుని, ఆపై “బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్”పై నొక్కండి.
లొకేషన్ షేరింగ్..
లొకేషన్ షేరింగ్ మీ ఐఫోన్ బ్యాటరీని చాలా వరకు డ్రెయిన్ చేస్తుంది. అందుకే ప్రతి యాప్ కోసం లొకేషన్‌ను షేర్ చేయవద్దు. దీన్ని ఆపడానికి, “సెట్టింగ్‌లు”కి వెళ్లి, “ప్రైవసీ” నొక్కండి, ఆపై “లోకేషన్” నొక్కండి. “ఎల్లప్పుడూ”కి బదులుగా “యాప్ యూజింగ్” ఎంపికను ఎంచుకోండి.
వైఫై వాడండి..
వినియోగదారులు సెల్యులార్ డేటాకు బదులుగా వైఫై ఎంపికను ఎంచుకోవాలి. సెల్యులార్ నెట్‌వర్క్‌లు చాలా శక్తిని వినియోగిస్తాయి. అందుకే వైఫై వినియోగిస్తే ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. అలాగే సెల్యూలర్ డేటాను ఎప్పుడూ ఆన్ లో ఉంచినా బ్యాటరీ బాగా వీక్ అవుతుంది. అవసరం అయిపోగానే డేటాను ఆఫ్ చేసుకోవాలి.
పవర్ సేవ్ మోడ్..
ఫోన్ బ్యాటరీ ఖాళీ అవుతుంటే, మీరు మీ ఐఫోన్‌లో తక్కువ పవర్ మోడ్‌ని యాక్టివేట్ చేయాలి. ఇది బ్యాటరీని తక్కువగా తగ్గిస్తుంది. దీని కోసం, మొదట “సెట్టింగ్‌లు”కి వెళ్లండి. తర్వాత “బ్యాటరీ”ని ఎంచుకుని, ఆపై “పవర్ సేవ్ మోడ్” ని ఎంచుకోవాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..