Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో నయా సేల్ షురూ.. రిప్లబిక్ డే సేల్‌లో ఆ ఉత్పత్తులపై కళ్లు చెదిరే ఆఫర్లు
తాజాగా ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024ను ప్రకటించింఇ. ఈ సేల్ జనవరి 14న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒక రోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ సేల్ జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్లతో పాటు టెక్ ఉత్పత్తులపై గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ తాజా సేల్‌లో ఏయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో? ఓసారి తెలుసుకుందాం.
భారతదేశంలో ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఈ కామర్స్ సైట్‌లు కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతి నెలా ప్రారంభంలో సేల్స్ ప్రకటించే కంపెనీలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆనందాన్ని రెట్టింపు చేయడానికి సేల్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024ను ప్రకటించింఇ. ఈ సేల్ జనవరి 14న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒక రోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ సేల్ జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్లతో పాటు టెక్ ఉత్పత్తులపై గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ తాజా సేల్‌లో ఏయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో? ఓసారి తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్‌డే సేల్‌లో ఐఫోన్ 15పై మొదటిసారిగా తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 13 ప్రో, 13 ప్రో ప్లస్‌తో ఇతర ఫోన్లపై ఆఫర్లను అందిస్తోంది. అలాగే ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ. 9,999గా ఉంటుంది. అలాగే క్యూఎల్‌ఈడీ టీవీలు రూ.21,999 కంటే తక్కువగా లభిస్తాయి. అలాగే మానిటర్లు రూ. 4,299కి అందుబాటులో ఉంటాయి. అలాగే ట్యాబ్స్‌పై కూడా రూ. 9,499 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ధరించగలిగిన వాటి విషయానికొస్తే స్మార్ట్‌వాచ్‌లు రూ 999 నుంచి ప్రారంభమవుతాయి. యాపిల్ ఐ ప్యాడ్ 9వ జెనరేషన్‌పై రూ. 23,749 అందుబాటులో ఉన్నాయి.
మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడానికి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్లు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 7ఏ, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్‌ఈ 5జీపై నమ్మలేని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14పై కూడా బడ్జెట్ ప్రియులను ఆకట్టుకునే ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే రెడ్‌మీ 13 ప్రో 5జీ ఫోన్ రూ.23,999కు కొనుగోలు చేయవచ్చు
మిడ్ రేంజ్‌తో పాటు ప్రీమియం మిడ్‌రేంజ్ సెగ్మెంట్లోని ఇతర డీల్స్ విషయానికి వస్తే మోటోరోలా ఎడ్జ్ 40, ఎడ్జ్ 40 నియో, సామ్‌సంగ్ ఎస్ 22 5జీ, గూగుల్ పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, అప్పో రెనో 10 సిరీస్ 5జీ, నథింగ్ ఫోన్ (2) తగింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. రూ. 20,000 లోపు డీల్ విషయానికొస్తే రియల్‌మీ 11 ఎక్స్ 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ, సామ్‌సంగ్ ఎఫ్ 14 5జీ, మోటో జీ 54 5జీ, ఇన్‌ఫినిక్స్ నోట్ 30 5జీ, పోకో ఎం6 పరో 5జీ, సామ్‌సంగ్ ఎఫ్ 34 5జీ, వివో టీ1 సీఓ2, రియల్‌మీ ఎక్స్5, రెడ్‌మీ 12, రియల్‌మీ సీ 53, ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ ఫోన్లపై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..