Best Camera Phones: ఫొటోగ్రఫీ కోసం బెస్ట్ ఫోన్లు ఇవే.. తక్కువ ధరలో హై రిజల్యూషన్ కెమెరాలు..

అధిక రిజల్యూషన్ తో కూడిన స్మార్ట్ ఫోన్లు అవసరం అవుతున్నాయి. ఫొటోగ్రఫీని ప్రొఫెషన్ గా ఎంచుకునే వారు కూడా తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు మొదట ఫోన్లలోనే చిన్న చిన్న షూట్స్ తీస్తుంటారు. వారికి కూడా మంచి కెమెరా ఫోన్లు కావాలి. అది కూడా తక్కువ ధరలో వస్తే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ క్రమంలో రూ. 20,000 లోపు ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లకు మీకు పరిచయం చేస్తున్నాం. ఓ లుక్కేయండి.

Best Camera Phones: ఫొటోగ్రఫీ కోసం బెస్ట్ ఫోన్లు ఇవే.. తక్కువ ధరలో హై రిజల్యూషన్ కెమెరాలు..
Best Smartphone
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 19, 2023 | 5:18 PM

ఇటీవల కాలంలో మంచి కెమెరా ఫోన్లకు ప్రాధాన్యం పెరిగింది. హై రిజల్యూషన్ కెమెరాలను అందరూ కోరుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలను ఫోన్లలో తీసుకునేలా చూసుకుంటున్నారు. ఎందుకంటే రీల్స్ అని, షార్ట్స్ అని యువత సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు, ఫొటోలు చేస్తున్నారు. అయితే వారు రూ. లక్షల్లో ఉండే కెమెరాలను కొనడం కష్టం. దీంతో వారికి అధిక రిజల్యూషన్ తో కూడిన స్మార్ట్ ఫోన్లు అవసరం అవుతున్నాయి. ఫొటోగ్రఫీని ప్రొఫెషన్ గా ఎంచుకునే వారు కూడా తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు మొదట ఫోన్లలోనే చిన్న చిన్న షూట్స్ తీస్తుంటారు. వారికి కూడా మంచి కెమెరా ఫోన్లు కావాలి. అది కూడా తక్కువ ధరలో వస్తే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ క్రమంలో రూ. 20,000 లోపు ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లకు మీకు పరిచయం చేస్తున్నాం. ఓ లుక్కేయండి.

శామ్సంగ్ గేలాక్సీ ఏ23.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ డిస్ ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. దీనిలో 50ఎంపీ ఓఐఎస్ క్వాడ్ కెమెరా ఉంటుంది. 10 రెట్ల డిజిటల్ జూమ్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమెరీ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఉంటుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 20,999గా ఉంది.

లావా అగ్ని 2.. దీనిలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ కర్వడ్ అమోల్డ్ డిస్ ప్లే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీనిలో కూడా 50ఎంపీ క్వాడ్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ మాక్రో, 2ఎంపీ డెప్త్ కెమెరాలు ఉంటాయి. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 4700ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 66వాట్ల సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 19,999 గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఐకూ జెడ్7ఎస్.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.38అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 64ఎంపీ ఓఐఎస్ అల్ట్రా స్టేబుల్ కెమెరా, 2ఎంపీ బోకే కెమెరా ఉంటుంది. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీనిలో అల్ట్రా స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్, మైక్రో మూవీ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, నైట్ మోడ్, పోర్ట్ రైట్ మోడ్, డబుల్ ఎక్స్ పోజర్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీనిలో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ. 17,999గా ఉంది.

పోకో ఎక్స్5 ప్రో.. ఈ ఫోన్లో అద్భుతమైన 108ఎంపీ కెమెరా ఉంటుంది. ముందువైపు సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 778జీ చిప్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. అమెజాన్లో ఇది రూ. 19,499కే లభ్యమవుతోంది.

ఒప్పో ఏ79.. దీనిలో 50ఎంపీ ఏఐ కెమెరా ఉంటుంది. 2ఎంపీ పోర్ట్ రైట్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 33వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సదుపాయం ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీని ధర రూ. 19,999గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
బాబోయ్.. విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?..
బాబోయ్.. విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?..
Telangana Elections: కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా..?
Telangana Elections: కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా..?
ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అసలు కారణం ఇదే..
ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అసలు కారణం ఇదే..
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
సౌతిండియా బ్యూటీ ఈ అమ్మాయి.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు..
సౌతిండియా బ్యూటీ ఈ అమ్మాయి.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు..
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
హైదరాబాద్‌లో బోగస్ ఓట్ల కలకలం.. పోలీసుల అదుపులోకి నిందితులు..
హైదరాబాద్‌లో బోగస్ ఓట్ల కలకలం.. పోలీసుల అదుపులోకి నిందితులు..
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..