AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Habits: మీ ఫోన్‪కు హాని చేసే చెడు అలవాట్లు ఇవే.. వీటిని మార్చుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు!

ఫోన్‌లో అత్యంత కీలకమైన భాగం బ్యాటరీనే. కాబట్టి బ్యాటరీని కాపాడుకుంటే ఫోన్‌ను కాపాడుకున్నట్లే. బ్యాటరీని కాపాడుకోవాలంటే చార్జింగ్‌ పెట్టే విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో చాలామందికి కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి.

Smartphone Habits: మీ ఫోన్‪కు హాని చేసే చెడు అలవాట్లు ఇవే.. వీటిని మార్చుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు!
Smartphone Charging
Madhu
|

Updated on: Mar 27, 2023 | 9:53 AM

Share

ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు టీచర్లు గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ పాఠాలు చెబుతారు. అంటే ఇవి చేయాలి.. ఇవి చేయకూడదంటూ మంచి అలవాట్లను నేర్పిస్తుంటారు. మన అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే మనం రోజూ వాడే ఫోన్ విషయంలో కూడా మన రోజూ చేసే పనులే ఫోన్ ఆరోగ్యాన్ని, అంటే దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. దాని లైఫ్ ని పెంచడమో.. తగ్గించడమో చేస్తుంది. ఫోన్‌లో అత్యంత కీలకమైన భాగం బ్యాటరీనే. కాబట్టి బ్యాటరీని కాపాడుకుంటే ఫోన్‌ను కాపాడుకున్నట్లే. బ్యాటరీని కాపాడుకోవాలంటే చార్జింగ్‌ పెట్టే విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో చాలామందికి కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన ఫోన్‌ లైఫ్‌ టైమ్‌ను కూడా పెంచుకోవచ్చు. మీ ఫోన్ బ్యాటరీకి చెడు చేసే మూడు ప్రధాన చెడు అలవాట్లు ఏంటో చూద్దాం రండి..

ఫోన్‌ కేసులోనే ఉంచి చార్జింగ్ పెట్టొద్దు..

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ఇది సర్వసాధారణమైన చెడు అలవాటు. ఎందుకంటే ఇలా ఫోన్‌ను ఫోన్‌ కేసులోనే ఉంచి చార్జింగ్‌ పెట్టడం ద్వారా ముఖ్యంగా రెండు సమస్యలు ఉంటాయి. అందులో ఒకటి బ్యాటరీ హీటెక్కడం అయితే, రెండోది చార్జింగ్‌ కనెక్టర్‌ తెగిపోవడం. నాసిరకం మెటీరియల్‌తో తయారయ్యే ఫోన్‌ కేసుల వల్ల చార్జింగ్‌ కేబుల్‌ రాపిడికి గురై క్రమంగా మొత్తానికే తెగిపోతుంది. కేస్‌లో ఉంచి చార్జింగ్‌ పెడితే ఫోన్‌ బాగా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కడంవల్ల చార్జింగ్‌ వేగం తగ్గుతుంది. అంతేగాక బ్యాటరీ జీవితకాలం కూడా తగ్గిపోతుంది.

రోజూ ఫాస్ట్ చార్జర్‌ని వాడొద్దు..

సాధారణంగా మనం స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు దాంతోపాటు వచ్చే చార్జర్‌లు ఫాస్ట్‌గా చార్జింగ్‌ అయ్యేవి ఉంటాయి. అయితే ప్రతిరోజూ ఈ ఫాస్ట్‌ చార్జర్‌లను వినియోగించడం కూడా చెడు చార్జింగ్‌ అలవాటు కిందే వస్తుంది. ఎందుకంటే కొత్త స్మార్ట్‌ఫోన్‌తో 40W లేదా అంతకంటే స్పీడ్‌ కలిగిన చార్జర్‌లు వస్తాయి. ప్రతిరోజూ ఈ చార్జర్‌లనే వినియోగిస్తే ఒత్తిడి పడి ఏడాదిలోపే ఫోన్‌లో బ్యాటరీ బాగా క్షీణిస్తుంది. అందుకే ఫాస్ట్‌ చార్జర్‌లకు బదులుగా బయట దొరికే నాణ్యమైన స్లో చార్జర్‌లను కొని వినియోగించడం ఉత్తమం. ఎప్పుడైనా వేగంగా చార్జింగ్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఫాస్ట్‌ చార్జర్‌లను వినియోగించుకోవచ్చు. కాబట్టి చార్జింగ్‌ కోసం రోజూ ఫాస్ట్‌ చార్జర్‌లను ఉపయోగించడం అనే చెడు అలవాటును మానుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఫోన్‌ చార్జింగ్‌ 5 శాతం కన్నా తగ్గకూడదు..

మీరు మీ స్మార్ట్‌ ఫోన్‌లో చార్జింగ్‌ 5% కంటే తగ్గేదాకా చూస్తున్నట్లయితే అది చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే ఇలా ఫోన్‌ చార్జింగ్ 5 శాతం కంటే దిగువకు పడిపోయినప్పుడు బ్యాటరీపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దాంతో బ్యాటరీ లైఫ్‌టైమ్‌ గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఫోన్‌ చార్జింగ్‌ 10 నుంచి 15% ఉన్నప్పుడే తిరిగి చార్జింగ్ పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి వీలుపడక ఫోన్‌లో చార్జింగ్‌ 5 శాతం దిగువకు పడిపోతే పర్వాలేదుగానీ, ప్రతిరోజూ 5 శాతానికి తగ్గేదాకా చూడటం బ్యాటరీకి మంచిది కాదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us