WhatsApp UPI: మెసేజ్ పంపినంత సులభంగా క్యాష్ ట్రాన్స్‌ఫర్.. వాట్సాప్ యూపీఐ.. ఇది చాలా ఈజీ గురూ..

|

Apr 02, 2024 | 2:32 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా కూడా పేమెంట్స్ సులభంగా చేయవచ్చు. సాధారణంగా మనం వాట్సాప్ ను చాటింగ్ కోసం మాత్రమే వాడుతుంటాం. ఫొటోలు, డాక్యుమెంట్లు వంటివి షేర్ చేయడానికి వినియోగిస్తాం. అయితే ఈ వాట్సాప్ ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ ఫర్ సులభంగా చేయొచ్చు. యూపీఐ ఆధారిత లావాదేవీలు నిర్వహించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

WhatsApp UPI: మెసేజ్ పంపినంత సులభంగా క్యాష్ ట్రాన్స్‌ఫర్.. వాట్సాప్ యూపీఐ.. ఇది చాలా ఈజీ గురూ..
Whatsapp Upi
Follow us on

దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా ఎక్కువయ్యాయి. ప్రజలు తమ చేతిలోని స్మార్ట్ ఫోన్ల ద్వారా చాలా సులభంగా చెల్లింపులు చేస్తున్నారు. చిల్లర కోసం ఇబ్బందులు పడకుండా ఎంతో సులువుగా షాపింగ్ చేసుకునే వీలు కలుగుతుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా డిజిటల్ పేమెంట్లు చాలా సులువుగా నిర్వహించుకునే వెసులుబాటు కలిగింది. చిన్న లావాదేవీలను కూడా చాలా సులువుగా జరపవచ్చు. చాలా రకాల ప్లాట్ పారంలు ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. వాటిల్లో మనం ఎక్కువగా ఉపయోగించేవి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటివి ఉంటాయి. అయితే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా కూడా పేమెంట్స్ సులభంగా చేయవచ్చు. సాధారణంగా మనం వాట్సాప్ ను చాటింగ్ కోసం మాత్రమే వాడుతుంటాం. ఫొటోలు, డాక్యుమెంట్లు వంటివి షేర్ చేయడానికి వినియోగిస్తాం. అయితే ఈ వాట్సాప్ ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ ఫర్ సులభంగా చేయొచ్చు. యూపీఐ ఆధారిత లావాదేవీలు నిర్వహించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

2020లోనే ప్రారంభం..

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ 2020లో యూపీఐ ఆధారిత చెల్లింపు ఫీచర్ ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చింది. తద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకునే వీలు కల్పించింది. దేశంలో వాట్సాప్ సబ్‌స్క్రైబర్లు 2024 నాటికి 535.8 మిలియన్లు. ఈ సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ డిజిటల్ లావాదేవీల విషయంలో గూగుల్ పే, ఫోన్ పే కంటే వాట్సాప్ వెనుకబడే ఉంది. అయితే వాట్సాప్ ద్వారా కూడా సులభంగానే యూపీఐ లావాదేవీలు చేయొచ్చు. అందుకోసం మీరు వాట్సాప్ ను మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ ద్వారా యూపీఐ లావాదేవీలు ఎలా చేయొచ్చొ మీకు స్టెప్ బై స్టెప్ విధానం ద్వారా వివరిస్తున్నాం. ఓ సారి చదివేయండి..

ఇవి కూడా చదవండి

వాట్సాప్ లో లావాదేవీలు చేసే విధానం..

  • ముందుగా ఎవరికి డబ్బులు చెల్లించాలనుకుంటున్నారో వారి వాట్సాప్ చాట్ విండోను తెరవండి. అటాచ్‌మెంట్ గుర్తుపై క్లిక్ చేయండి.
  • చెల్లింపు అనే ఎంపికను ఎంచుకోండి, దానిలోని నిబంధనలు, షరతులను అంగీకరించాలి.
  • మీరు ట్రాన్స్ ఫర్ చేయాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయండి. అనంతరం మీ యూపీఐ పిన్ నంబర్ ను నమోదు చేయండి.
  • మీ చెల్లింపు ప్రక్రియ చాలా సులువుగా పూర్తయ్యింది. అంటే ఒక చిన్న మెసేజ్ లేదా ఫొటో పంపినంత ఈజీగా డబ్బులను ట్రాన్స్ ఫర్ చేశారు.
  • మీ వాట్సాప్ విండో లోనే మనీ ట్రాన్స్ ఫర్ వివరాలు ఉంటాయి. అవసరమైతే ఆ వివరాలను కూడా పంపించవచ్చు.

వాట్సాప్ యూపీఐ సెట్ చేసుకునే విధానం..

  • మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
  • చెల్లింపులు అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
  • కొత్త ఖాతాను జోడించుపై క్లిక్ చేయండి.
  • మీ బ్యాంకును ఎంచుకోవాలి. తర్వాత యూపీఐ పిన్ నంబర్ సెట్ చేయాలని అడుగుతుంది.
  • మీకు నచ్చిన నంబర్లతో పిన్ సెట్ చేసుకోండి. ఇక మీ వాట్సాప్ నుంచి లావాదేవీలు ప్రారంభించండి.

క్యూ ఆర్ స్కాన్ విధానం..

  • వాట్సాప్ లోని క్యూ ఆర్ స్కాన్ ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయవచ్చు.
  • వాట్సాప్ ను తెరిచి సెట్టింగ్‌లోకి వెళ్లండి.
  • న్యూ పేమెంట్ ఆప్షన్ ను ఎంచుకోండి.
  • స్కాన్ క్యూఆర్ కోడ్ ను ఎంపికను ఎంచుకోండి.
  • మీ కెమెరాను క్యూఆర్ కోడ్‌కు సూచించండి.
  • మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి. మీ యూపీఐ పిన్ నంబర్ ను నమోదు చేసి, చెల్లింపులను పూర్తి చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..