AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 5 కార్లు ఇండియాలోనే టాప్ క్లాస్ ఫీచర్లతో రాబోతున్నాయి..! మీరు కొనాలంటే ఒక్కసారి వీటిపై ఓ లుక్కేయండి..

These 5 Cars: ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. దీనికి అతి పెద్ద కారణం కొత్త వాహనాల సందడి,

ఈ 5 కార్లు ఇండియాలోనే టాప్ క్లాస్ ఫీచర్లతో రాబోతున్నాయి..! మీరు కొనాలంటే ఒక్కసారి వీటిపై ఓ లుక్కేయండి..
Nissan Magnite
uppula Raju
|

Updated on: Aug 27, 2021 | 8:54 AM

Share

These 5 Cars: ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. దీనికి అతి పెద్ద కారణం కొత్త వాహనాల సందడి, కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి పెట్టడం. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా తమ ప్రయోగాన్ని పూర్తిగా నిలిపివేసిన కంపెనీలు ఇప్పుడు నిరంతరం కొత్త కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే ఇది మీకు గొప్ప అవకాశం. ఎందుకంటే చాలా కొత్త కార్లు రాబోతున్నాయి. ఈ 5 కార్లు ఇండియాలోనే గొప్ప ఫీచర్లతో రాబోతున్నాయి. కానీ వాటిని కొనడానికి మీరు కొంతకాలం వేచి ఉండక తప్పదు. ఒక్కసారి ఆ కార్ల గురించి తెలుసుకుందాం.

1. మహీంద్రా థార్ మహీంద్రా థార్ ప్రారంభించినప్పుడు దాని క్రేజ్ విపరీతంగా ఉండేది. ప్రతి ఒక్కరూ ఈ వాహనాన్ని కొనాలని కోరుకున్నారు. అయితే మీరు కూడా ఈ వాహనాన్ని తీసుకోవాలనుకుంటే మీరు 1 సంవత్సరం వేచి ఉండాలి. ఎందుకంటే దాని వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ.

2. హ్యుందాయ్ క్రెటా హ్యుందాయ్‌ని అగ్రస్థానంలో నిలబెట్టింది క్రెటా. కంపెనీ ఈ సంవత్సరం కొత్త క్రెటాను విడుదల చేయనుంది. దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీనిని కొనుగోలు చేయడానికి మీరు 9 నెలలు వేచి ఉండాలి.

3. నిస్సాన్ మాగ్నైట్ నిస్సాన్ ఈ కాంపాక్ట్ SUV ని లాంచ్ చేసినప్పుడు వాహనం బంపర్ సేల్ కలిగి ఉంది. ప్రస్తుతం చాలామంది ఈ కారును కొనాలని ఆసక్తిగా ఉన్నారు. కానీ భారీ డిమాండ్ కారణంగా ఈ వాహనాన్ని కొనడానికి మీరు 8 నెలలు వేచి ఉండాలి.

4. కియా సొనెట్ కియా వాహనాలు భారతదేశంలో బాగా పనిచేస్తున్నాయి. కాంపాక్ట్ SUV లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో సోనెట్ ఒకటి. కానీ మీరు దానిని కొనుగోలు చేయడానికి 5 నెలలు వేచి ఉండాలి.

5. కియా సెల్టోస్ ఈ వాహనం కూడా శక్తివంతమైన ఫీచర్లతో రాబోయే SUV. కానీ దీనిని కొనడానికి మీరు 5 నెలలు వేచి ఉండాలి. పట్టణాలను బట్టి వేయిట్ చేసే సమయం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

Telangana: బార్ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు.. మాములుగా చూస్తే వాంతి వస్తుంది.. వాటినే వేడివేడిగా..

Telangana Crime News: మద్యం మత్తులో స్నేహితుల మధ్యన ఘర్షణ.. కత్తితో దాడి చేసి హత్య చేసిన స్నేహితుడు

Star Air: హైదరాబాద్‌ టు బెంగుళూర్ మధ్య విమాన సర్వీసు ప్రారంభించిన ‘స్టార్‌ఎయిర్’