MobilePhone: మొబైల్‌ వాడితే బ్రెయిన్‌ క్యాన్సర్‌.. ఇందులో అసలు నిజమెంత..

ఇదిలా ఉంటే స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా గంటలతరబడి స్మార్ట్ ఫోన్‌ ఉపయోగించడం వల్ల కంటి సంబంధిత సమస్యలు మొదలు, మెడ నొప్పి, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తుంటారు. అయితే ఎక్కువ సేపు ఫోన్‌ మాట్లాడే వారిలో బ్రెయిన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుందని..

MobilePhone: మొబైల్‌ వాడితే బ్రెయిన్‌ క్యాన్సర్‌.. ఇందులో అసలు నిజమెంత..
Mobile Phone
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 05, 2024 | 11:44 AM

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగం వాడకం ఓ రేంజ్‌లో పెరిగిన విషయం తెలిసిందే. ప్రతీ ఒక్కరి చేతిలో కచ్చితంగా ఫోన్‌ ఉండాల్సిందే. ఒకప్పుడు ఇంట్లో ఒక్క ఫోన్‌ ఉంటే గొప్ప కానీ.. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఫోన్స్‌ ఉంటున్నాయి. ఆ మాటకొస్తే కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఫోన్స్‌ ఉంటున్నాయి. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ రాకతో మొబైల్స్ వినియోగం మరింత పెరిగింది.

ఇదిలా ఉంటే స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా గంటలతరబడి స్మార్ట్ ఫోన్‌ ఉపయోగించడం వల్ల కంటి సంబంధిత సమస్యలు మొదలు, మెడ నొప్పి, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తుంటారు. అయితే ఎక్కువ సేపు ఫోన్‌ మాట్లాడే వారిలో బ్రెయిన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుందని ఒక నమ్మకం ఉంది. ఇంతకీ ఈ నమ్మకంలో నిజం ఎంత ఉంది.? తాజాగా నిర్వహించిన పరిశోధల్లో తేలిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిన అంశాల ప్రకారం.. మొబైల్ ఫోన్‌ వినియోగానికి, బ్రెయిన్‌ క్యాన్సర్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రివ్యూలో సైతం ఇదే విషయం వెల్లడైంది. గడిచిన కొన్నేళ్లలో మొబైల్‌ ఫోన్‌ వాడకం విపరీతంగా పెరిగినా, అదే స్థాయిలో బ్రైయిన్‌ క్యాన్సర్‌ కేసులు పెరగలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. పదేండ్లకు పైగా మొబైల్‌ ఫోన్లు వాడుతున్న వారు, మొబైల్‌ ఫోన్లతో ఎక్కువ సమయం గడిపేవారిలోనూ బ్రెయిన్‌ క్యాన్సర్‌ కేసుల సంఖ్య పెరగలేదని పరిశోధకులు గుర్తించారు.

1994 నుంచి 2022 మధ్య నిర్వహించిన 63 అధ్యయనాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. అలాగే పరిశోధనల్లో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ నిపుణులు సహా పది దేశాల నుంచి 11 మంది పరిశోధకులు ఈ రీసెర్చ్‌ను చేపట్టారు. ఇందుకుగాను పరిశోధకులు.. మొబైల్‌ ఫోన్లు, టీవీలు, బేబీ మానిటర్స్‌, రాడార్‌ వంటి పరికరాల్లో ఉపయోగించే రేడియోఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ ప్రభావాలపై దృష్టిసారంచారు. మొబైల్‌ ఫోన్ల వాడకానికి, బ్రెయిన్‌ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం వెల్లడి కాలేదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..