WhatsApp: ఒక్కో కాంటాక్ట్ కి ఒక్కో రింగ్ టోన్, వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఎలా సెట్ చేసుకోవాలంటే..

| Edited By: Anil kumar poka

Jan 22, 2023 | 6:19 PM

ప్రస్తుతం వాట్సాప్ లేకుండా ప్రపంచాన్ని ఊహించలేం .చాలా మంది దీనిని వాడుతారు కానీ దానిలోని చాలా ఫీచర్ల గురించి తెలీదు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన ఫీచర్ ను మీకోసం అందిస్తున్నాం.. అదేంటంటే వాట్సాప్ రింగ్ టోన్ ఫీచర్. ప్రతి కాంటాక్ట్ కి , అలాగే ప్రతి గ్రూప్ ప్రత్యేకంగా రింగ్ టోన్ పెట్టుకొనే వెసులుబాటు వాట్సాప్ లో ఉంది.

WhatsApp: ఒక్కో కాంటాక్ట్ కి ఒక్కో రింగ్ టోన్, వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఎలా సెట్ చేసుకోవాలంటే..
Whatsapp
Follow us on

ఒకప్పుడు ఉభయకుశలోపరి అని మొదలు పెడుతూ ఉత్తరాలు రాసుకునేవారు. నెలకో రెండునెలలకో, ఏదైనా అవసరమైనప్పుడో పంపిస్తూ ఉండేవారు. ఫోన్ల రాకతో ఉత్తరాలకు కాలం చెల్లింది. ఇక రానురాను అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత దీనిని మరింత తేలిక చేసేసింది. సోషల్ మీడియా ప్రభంజనంతో సెకన్ల వ్యవధిలో ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా ఇన్ఫర్మేషన్ ఇట్టే తెలిసిపోతోంది. దీనిలో వాట్సాప్ చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం వాట్సాప్ లేకుండా ప్రపంచాన్ని ఊహించలేం. ఎందుకంటే పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకూ, చిన్న చిన్ని బడ్డీ కొట్లు ల నుంచి బడా వ్యాపార సంస్థల వరకూ, ఉద్యోగులు, వ్యక్తులు, కుటుంబాలు, స్నేహితులు ఇలా ఒకటేమిటి , ఒకరేమిటి అందరి కమ్యూనికేషన్ కు ఈ వాట్సాప్ పైనే ఆధారపడుతున్నారు. వ్యక్తికీ వ్యక్తికి మధ్య పర్సనల్ చాట్ తో పాటు ఇందులోని గ్రూప్స్ సమాచార మార్పిడి బాగా ఉపకరిస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీని వినియోగదారులు నానాటికీ పెరుగుతున్నారు. మెటా యాజమాన్యంలో నడిచే ఈ వాట్సాప్ కు మన దేశంలో కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు. చాలా మంది దీనిని వాడుతారు కానీ దానిలోని చాలా ఫీచర్ల గురించి తెలీదు. కనీసం తెలుసుకోవాలని కూడా ప్రయత్నించరు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన ఫీచర్ ను మీకోసం అందిస్తున్నాం.. అదేంటంటే వాట్సాప్ రింగ్ టోన్ ఫీచర్. ప్రతి కాంటాక్ట్ కి , అలాగే ప్రతి గ్రూప్ ప్రత్యేకంగా రింగ్ టోన్ పెట్టుకొనే వెసులుబాటు వాట్సాప్ లో ఉంది. ఆ ఫీచర్ ఏమిటి? ఎలా పనిచేస్తుంది? ఎలా సెట్ చేసుకోవాలి? అనే వివరాలు చూద్దాం..

ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు..

ఆండ్రాయిడ్ ఫోన్ కలిగిన వాట్సాప్ వినియోగదారులు వ్యక్తిగత కాల్స్ కోసం రింగ్ టోన్ పెట్టుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

  • మీరు ప్రత్యేక రింగ్ టోన్ కావాలనుకుంటున్న కాంటాక్ట్ ను సెలెక్ట్ చేయండి.
  • వారి పేరుపై క్లిక్ చేసి లోపలికి వెళ్లండి.
  • ప్రోఫైల్ లో కింద కనిపించే కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.
  • యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ ను క్లిక్ చేసి, కింద వచ్చే మెనూ నుంచి రింగ్ టోన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి రింగ్ టోన్ ని ఎంపిక చేసుకోండి.

ఐఫోన్ యూజర్లు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి..

  • మీరు ప్రత్యేక రింగ్ టోన్ పెట్టాలనుకుంటున్న వ్యక్తిని మీ కాన్వర్జేషన్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని, వారి పేరుపై క్లిక్ చేయండి.
  • కింద మెనూ నుంచి వాల్‌పేపర్ & సౌండ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
  • దాని కింద కస్టమ్ టోన్ బటన్ క్లిక్ చేసి, అలర్ట్ టోన్ లోకి వెళ్లి మీకు ఇష్టమైన రింగ్ టోన్ ను సెట్ చేసుకోండి.

గ్రూప్ లకు రింగ్ టోన్ సెట్ చేయాలంటే..

  • మీ చాట్స్ లో నుంచి ప్రత్యేక రింగ్ టోన్ పెట్టాలనుకుంటున్న గ్రూప్ ను ఎంపిక చేసుకొని, దాని పేరుపై క్లిక్ చేయండి.
  • ఆ గ్రూప్ ప్రోఫైల్ లో కింద కనిపించే కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
  • తర్వాత యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ ను క్లిక్ చేసి, కింద వచ్చే మెనూ నుంచి రింగ్ టోన్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
  • ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి రింగ్ టోన్ ని పెట్టుకోండి.

అయితే ఐఫోన్ వినియోగదారులకు మాత్రం గ్రూప్ లకు రింగ్ టోన్ సెట్ చేసుకొనే అవకాశం లేదు. ప్రీ సెట్ టోన్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..