కొత్త స్మార్ట్‌ఫోన్‌పై ఎవరూ ఊహించని భారీ డిస్కౌంట్.. ఎక్కడా ఇలాంటి ఆఫర్ చూసి ఉండరు..

ఒకవైపు ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు ఇస్తున్నారు. అయితే దీంతో పాటు మరో ఫోన్‌పై భారీ డిస్కౌంట్ వస్తోంది. ఇది ఇటీవల లాంచ్ అయిన ఫోన్ కావడం గమనార్హం.

కొత్త స్మార్ట్‌ఫోన్‌పై ఎవరూ ఊహించని భారీ డిస్కౌంట్.. ఎక్కడా ఇలాంటి ఆఫర్ చూసి ఉండరు..
Iqoo

Updated on: Dec 01, 2025 | 2:20 PM

iQOO 15: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ ఇటీవల iQOO 15 ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అమ్మకానికి వచ్చింది. అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు తక్కువ ధరకే మీరు ఆఫర్లలో కొనుగోలు చేయవచ్చు. ఏకంగా రూ.7 వేలు తగ్గింపు ఈ ఫోన్‌పై వస్తుంది. దీంతో మంచి బ్రాండ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఫోన్ లాంచ్ అయిన కొద్ది రోజుల్లో ఇంత పెద్ద ఆఫర్ పెట్టడం నిజంగా మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.

ఫోన్ ఫీచర్లు

-స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్

-16GB వరకు ర్యామ్

-6.85-అంగుళాల శాంసంగ్ M14 అమోల్డ్ డిస్‌ప్లే

-144Hz వరకు రిఫ్రెష్ రేట్‌

-7,000mAh సామర్థ్యం గల బ్యాటరీ

-100W ఫాస్ట్ ఛార్జింగ్

-బ్లాక్ అండ్ వైట్ కలర్లు

ధరలు

12GB + 256GB  వేరియంటె ధర రూ. 72,999గా ఉంది. అయితే బ్యాంకు డిస్కౌంట్‌పై రూ. 64,999కే ఈ ఫోన్ వస్తోంది. ఇక 16GB + 512GB స్టోరేజీ వేరియెంట్ ధర రూ. 79,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్లతో రూ. 71,999గా వస్తోంది. అమెజాన్, ఐక్యూ, వివో స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. HDFC, ICICI బ్యాంకు ఆఫర్లపై రూ.7 వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తోంది. ఇక రూ.7 వేల ఎక్సేంజ్ బోనస్ కూడా అందిస్తున్నారు. ఈ పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌పై ఇచ్చి కొత్త ఫోన్ తీసుకునే సదుపాయం ఉంది.