Tech Tips: గత 24 గంటల్లో మీ వాట్సాప్‌ డీపీని ఎవరు చూశారో తెలుసుకోవాలనుకుంటున్నారా?

|

Dec 17, 2022 | 6:06 PM

ఈ రోజుల్లో వాట్సాప్‌కు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాటింగ్‌లు, స్టేటస్‌లో, గ్రూప్‌ మెసేజ్‌లతో మునిగి తేలుతున్నారు..

Tech Tips: గత 24 గంటల్లో మీ వాట్సాప్‌ డీపీని ఎవరు చూశారో తెలుసుకోవాలనుకుంటున్నారా?
Whatsapp Feature
Follow us on

ఈ రోజుల్లో వాట్సాప్‌కు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాటింగ్‌లు, స్టేటస్‌లో, గ్రూప్‌ మెసేజ్‌లతో మునిగి తేలుతున్నారు. మన దైనందిన కార్యకలాపాలకు అంతే ప్రాముఖ్యతనిస్తున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు, ఈ మెసేజింగ్ యాప్ ఉపయోగించబడుతుంది. భారతదేశంలోనే దాదాపు 550 మిలియన్ల మంది దీనిని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ట్రిక్స్ వంటి అనేక థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి. అయితే వాట్సాప్‌లో మనం పెట్టిన డీపీని ఎవరు చూశారో కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా, ఆ యాప్ ఏమిటి, ఎలా డౌన్‌లోడ్ చేయాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

వాట్సాప్‌ డీపీని ఎవరెవరు చూశారనే విషయం తెలుసకోవాలంటే థర్డ్ పార్టీ యాప్ అవసరం. ఈ యాప్‌తో వాట్సాప్‌లో మీ డీపీని ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిలో మీ డీపీ చూసిన వారు పేరు, నంబర్‌ను కూడా పొందవచ్చు. దీని కోసం మీరు ముందుగా మీరు గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లాలి. అందులో నుంచి WhatsApp- Who Viewed Me లేదా Whats Tracker అనే థర్డ్ పార్టీ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది మీకు తెలియకుండానే మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూస్తున్నారనే సమాచారాన్ని అందిస్తుంది. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత రన్ చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఈ యాప్ మీకు గత 24 గంటల్లో మీ ప్రొఫైల్ ఫోటో లేదా డీపీని వీక్షించిన వారి జాబితాను అందిస్తుంది.

ఇంకో హెచ్చరిక ఏంటంటే.. ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ యాప్‌లు మీ ఫోన్‌కి ఎంతవరకు సురక్షితమో అధికారిక సమాచారం లేదు. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను స్వాధీనం చేసుకోగలదు. అందుకే ఈ థర్డ్ పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. నమ్మకం కలిగిన యాప్ స్టోర్‌ల నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి