Whatsapp: గ్రూప్ అడ్మిన్‌లూ.. ఇకపై మీరే కింగ్‌లు.. అడ్మిన్‌లకు తిరుగులేని పవర్ ఇవ్వనున్న వాట్సాప్..
Whatsapp: యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ, ఎన్నో అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం...
Whatsapp: యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ, ఎన్నో అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో యూజర్లను అట్రాక్ట్ చేస్తూనే ఉంటుందీ యాప్. అందుకే ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వచ్చినా వాట్సాప్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ గడువును పెంచింది, డీపీ ఎంపిక చేసిన వారికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకునే ఫీచర్‌ను పరిచయం చేసింది.
ఇలా ఎన్నో సూపర్ ఫీచర్స్‌ను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా.. గ్రూప్ అడ్మిన్‌ల కోసం ప్రత్యేకంగా ఓ ఫీచర్‌ను తీసుకురానుంది. తప్పుడు సమాచారం వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికే ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీంతో వాట్సాప్ అడ్మిన్‌లకు గ్రూపుల్ ఏ మెసేజ్‌నైనా తొలగించే అధికారం రానుంది. వాట్సాప్ గ్రూప్స్‌లో సర్క్యూలేట్ అయ్యే కంటెంట్‌కు అడ్మినే బాధ్యుడు అని చట్టం చెబుతోన్న నేపథ్యంలో వాట్సాప్ తీసుకొచ్చే ఈ కొత్త ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్‌లో టెస్టింగ్ చేస్తున్నారు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..