Smart Necklace: ధూమపానం ఎక్కువ చేస్తున్నారా? ఈ స్మార్ట్ నెక్లెస్ ధరిస్తే స్మోకింగ్ ట్రాక్ చేయడం సులభం

|

Feb 15, 2023 | 3:15 PM

ముఖ్యంగా ధూమపానం చేసే వారు ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు వివిధ ప్రశ్నలు అడుగుతారు. వాటికి మనం ఇచ్చే సమాధానం బట్టే డాక్టర్లు మన ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చి ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. కానీ ప్రతిసారి మనం సమాధానం చెప్పే అవకాశం లేకపోవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిశోధకులు ఓ నెక్లెస్‌ను రూపొందించారు.

Smart Necklace: ధూమపానం ఎక్కువ చేస్తున్నారా? ఈ స్మార్ట్ నెక్లెస్ ధరిస్తే స్మోకింగ్ ట్రాక్ చేయడం సులభం
Smoking
Follow us on

ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ లైన్ మనం ఏ సినిమాకు వెళ్లినా మొదట్లో వేస్తారు. మొదట్లో స్టైల్ కోసం మొదలు పెట్టే ధూమపానం క్రమేపి వ్యసనంగా మారుతుంది. ధూమపానం మరీ ఎక్కువైతే వివిధ క్యాన్సర్లకు కారణమై ప్రాణం పోయే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ధూమపానం చేసే వారు ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు వివిధ ప్రశ్నలు అడుగుతారు. వాటికి మనం ఇచ్చే సమాధానం బట్టే డాక్టర్లు మన ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చి ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. కానీ ప్రతిసారి మనం సమాధానం చెప్పే అవకాశం లేకపోవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిశోధకులు ఓ నెక్లెస్‌ను రూపొందించారు. ఈ నెక్లెస్ ద్వారా ధూమపానం ఎంత సేపు చేశాం. ఎన్ని పఫ్‌లు లాగాం వంటి వివరాలను ట్రాక్ చేయవచ్చు. ఈ నెక్లెస్ ద్వారా వచ్చే ఇతర లాభాలను ఓ సారి చూద్దాం.

పరిశోధకులు రూపొందించిన ఈ స్మోక్‌మాన్ స్మార్ట్ నెక్లెస్‌తో మీరు స్మోకింగ్ చేసే ప్రతి పఫ్‌తో మీ ధూమపాన అలవాట్లను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే సిగరెట్ తాగినప్పుడు వేడిని ట్రాక్ చేసేలా ఈ నెక్లెస్‌ను అభివృద్ధి చేశారు. ధూమపానం చేసే వ్యక్తి ఎంత పీల్చుకుంటాడో, పఫ్‌ల మధ్య సమయాన్ని కూడా నెక్లెస్ ట్రాక్ చేయగలదు. సిగరెట్ ఎప్పుడు వెలిగిస్తున్నారు? వ్యక్తి దానిని నోటికి పట్టుకుని ఊపిరి పీల్చుకున్నప్పుడు, వారు ఎంత పీల్చుకుంటారు? పఫ్‌ల మధ్య ఎంత సమయం పడుతుంది? వారి నోటిలో సిగరెట్ ఎంతసేపు ఉందో? మనం ఈజీగా గుర్తించవచ్చు. స్మోక్‌మాన్ స్మార్ట్ నెక్లెస్‌తో, కెమికల్ ఎక్స్‌పోజర్‌ని అంచనా వేయడం ద్వారా వినియోగదారులు పొగాకు సంబంధిత వ్యాధులైన క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధి, మధుమేహం, సీఓపీడీ, ఎంఫిసెమా, క్రానిక్ బ్రోన్కైటిస్ మధ్య సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. అలాగే స్మోకింగ్ టోపోగ్రఫీ అని పిలిచే వాటిని కొలవడానికి స్మార్ట్ నెక్లెస్ అభివృద్ధి చేశారు. ఇది ధూమపానం చేసేవారికి ఎంత కార్బన్ మోనాక్సైడ్ బహిర్గతమవుతుంది అనేదానిని అంచనా వేయడానికి, ధూమపానం మానేయడానికి ప్రయత్నించే వారికి సహాయపడటానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలుపుతుంది. అయితే ఈ నెక్లెస్ పని చేయడానికి అనువుగా యాప్ ఉంటుందో లేదో అని పరిశోధకులు ఇంకా వెల్లడించలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..