Samsung Tablets: శామ్సంగ్ నుంచి రెండు కొత్త ట్యాబ్లెట్లు.. టాప్ ఫీచర్లు.. తక్కువ ధరలోనే.. పూర్తి వివరాలు ఇవి..
ఇటీవల కాలంలో ట్యాబ్లెట్ల వినియోగం గణనీయంగా పెరిగింది. చదువులు డిజిటల్ బాట పట్టడంతో విద్యార్థులు ఎక్కువగా ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నారు. దీంతో ప్రతి ఇంట్లో ట్యాబ్లెట్ అవసంరం అవుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కూడా తక్కువ ధరలో బెస్ట్ బ్రాండ్, టాప్ స్పెసిఫికేషన్లు ఉన్న ట్యాబ్లెట్లను వెతుకుతున్నారు. ఇదే క్రమంలో శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9, ఏ9 ప్లస్ మన దేశంలో లాంచ్ చేసింది.

ఫెస్టివ్ సీజన్లో కేవలం ఆఫర్లే కాదు.. కొత్త ఉత్పత్తుల లాంచింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెక్ ప్రొడక్ట్స్ ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్ లు కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదే క్రమంలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ తన సరికొత్త గెలాక్సీ ట్యాబ్ ఏ9 మరియు గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ లను మన దేశంలో ఆవిష్కరించింది. ఈ రెండు టాబ్లెట్‌లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్2023ను నడుపుతోంది. ఈ ప్రత్యేకమైన పండుగ సేల్లో ఈ శామ్సంగ్ ట్యాబ్లెట్లపై ప్రారంభ ఆఫర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పెరిగిన ట్యాబ్లెట్ల వినియోగం..
ఇటీవల కాలంలో ట్యాబ్లెట్ల వినియోగం గణనీయంగా పెరిగింది. చదువులు డిజిటల్ బాట పట్టడంతో విద్యార్థులు ఎక్కువగా ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నారు. దీంతో ప్రతి ఇంట్లో ట్యాబ్లెట్ అవసంరం అవుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కూడా తక్కువ ధరలో బెస్ట్ బ్రాండ్, టాప్ స్పెసిఫికేషన్లు ఉన్న ట్యాబ్లెట్లను వెతుకుతున్నారు. ఇదే క్రమంలో శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9, ఏ9 ప్లస్ మన దేశంలో లాంచ్ చేసింది.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9 ధర, లభ్యత..
అమెజాన్ వెబ్‌సైట్‌లోని ఆఫర్‌ల ప్రకారం, గెలాక్సీ ట్యాబ్ ఏ9 ధర 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వైఫై ఓన్లీ వేరియంట్ రూ. 12,999గా ఉంది. అలాగే వైఫై ప్లస్ 5జీ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. అదే విధంగా గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ ట్యాబ్లెట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వైఫై ఓన్లీ వేరియంట్ ధర రూ. 20,999గా ఉంది. అయితే వైఫై ప్లస్ 5జీ వేరియంట్ ధరకుసంబంధించిన వివరాలు ప్రస్తుతం ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవు. రెండు మోడల్స్ డార్క్ బ్లూ, గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తున్నాయి.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9 స్పెసిఫికేషన్లు..
ఈ ట్యాబ్ లో 800 x 1,340 పిక్సల్స్ రిజల్యూషన్, 60హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 8.7-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను కలిగి ఉంది. ట్యాబ్‌లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ99 చిప్‌సెట్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఇది మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది. అందువల్ల స్టోరేజ్ మరింత విస్తరించదగినది. 2ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8ఎంపీ వెనుకవైపు ఉంటాయి. 15వాట్ల చార్జింగ్ సపోర్టుతో 5,100ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ స్పెసిఫికేషన్లు..
ఈ ట్యాబ్లెట్ 1,200 x 1,920 పిక్సల్స్ రిజల్యూషన్, 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఈ ట్యాబ్ లో కూడా ఆండ్రాయిడ్ 13, వన్ యూఐ 5.1 ఓఎస్ ప్లాట్ ఫారం ఉంటుంది. క్వాల్ కామ్ ఎస్ఎం6375 స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ లో 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అలాగే వెనుకవైపు 8ఎంపీ రేర్ షూటర్ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చే సరికి 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో కూడిన 7040 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..