Samsung Republic Day Sale: టీవీ కొనండి.. రూ. లక్ష విలువైన బహుమతిగా పట్టండి.. శామ్సంగ్ నుంచి అదిరే డీల్స్..
శామ్సంగ్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్లెట్లు ఇతర ఉపకరణాలపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. శామ్సంగ్ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ పేరిట తీసుకొచ్చిన ప్రత్యేక సేల్లో మొబైల్స్ పై 57శాతం, టీవీలపై 48శాతం వరకూ తగ్గింపు అందిస్తోంది. శామ్సంగ్ అధికారిక వెబ్ సైట్ గానీ, కంపెనీ అధికారిక స్టోర్స్ లో గానీ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాక హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా లావాదేవీ జరిపితే దాదాపు 22.5శాతం క్యాష్ బ్యాక్ రూ. 25,000 వరకూ అందిస్తోంది.

మన దేశంలో టాప్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గృహోపకరణాల బ్రాండ్లలో శామ్సంగ్ ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఈ దిగ్గజం మన దేశంలో ఒక ట్రస్టెడ్ బ్రాండ్. టీవీలు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ ఫోన్లు ఇలా ప్రతీది శామ్సంగ్ బ్రాండ్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. ఈ కంపెనీపై జనాలకు ఓ నమ్మకం ఏర్పడింది. అందుకు కారణం ఈ కంపెనీ వస్తువుల నాణ్యత, మన్నిక, అనువైన ధరలే కారణం. కాగా ఈ శామ్సంగ్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్లెట్లు ఇతర ఉపకరణాలపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. శామ్సంగ్ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ పేరిట తీసుకొచ్చిన ప్రత్యేక సేల్లో మొబైల్స్ పై 57శాతం, టీవీలపై 48శాతం వరకూ తగ్గింపు అందిస్తోంది. శామ్సంగ్ అధికారిక వెబ్ సైట్ గానీ, కంపెనీ అధికారిక స్టోర్స్ లో గానీ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాక హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా లావాదేవీ జరిపితే దాదాపు 22.5శాతం క్యాష్ బ్యాక్ రూ. 25,000 వరకూ అందిస్తోంది. ఈ నేపథ్యంలో శామ్సంగ్ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ 2024 కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు ఇవే..
శామ్సంగ్ గెలాక్సీ ఎ సిరీస్, ఎం సిరీస్, ఎఫ్ సిరీస్, ఎస్ సిరీస్, జెడ్ సిరీస్ మోడళ్లపై 57 శాతం వరకు తగ్గింపును అందిస్తామని శాంసంగ్ ప్రకటించింది. అదనంగా, తాజా శామ్సంగ్ ఎస్24 సిరీస్‌ను ప్రీ-బుకింగ్ చేసే కొనుగోలుదారులు లాభదాయకమైన ఆఫర్‌లను కూడా పొందవచ్చు. అలాగే గెలాక్సీ బుక్ గో, గెలాక్సీ బుక్ 3, గెలాక్సీ బుక్ 3 ప్రో మోడళ్లపై కొనుగోలుదారులు 46 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. వెరబుల్స్, ట్యాబ్లెట్ల విషయానికి వస్తే 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
శామ్సంగ్ ప్రకటించిన దాని ప్రకారం.. గెలాక్సీ ఎస్21ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్23, గెలాక్సీ జెడ్ ఫోల్డ్5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్5, గెలాక్సీ ఏ15 5జీ, గెలాక్సీ ఏ34 5జీ, గెలాక్సీ జీ24 5జీ, గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ ఫోన్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే గెలాక్సీ ఎం14, గెలాక్సీ ఎఫ్34, గెలాక్సీ ఎఫ్14, గెలాక్సీ ఎం04 వంటి 4జీ ఫోన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. అదే విధంగా ట్యాబ్లెట్ల విషయానికొస్తే కంపెనీ గెలాక్సీ ట్యాబ్ ఏ9ప్లస్, గెలాక్సీ ట్యాబ్ ఎస్9, గెలాక్సీ ట్యాబ్ ఎస్9ఎఫ్ఈ ప్లస్.. స్మార్ట్ వాచ్ ల కేటగిరీలో గెలాక్సీ వాచ్6 క్లాసిక్ ఎల్టీఈ 47ఎంఎం, గెలాక్సీ వాచ్6 బ్లూటూత్ 43ఎంఎం, గెలాక్సీ గెలాక్సీ బడ్స్2 ప్రో వంటి మోడళ్లపై ఆఫర్లు ఉన్నాయి.
శామ్సంగ్ టీవీలపై ఆఫర్లు ఇలా..
శామ్సంగ్ ప్రీమియం, లైఫ్ స్టైల్ టీవీ మోడళ్లపై 48శాతం తగ్గింపుతో పాటు రూ. 15,250 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. శామ్సంగ్ నియో క్యూఎల్ఈడీ, క్యూ ఎల్ఈడీ టీవీలపై అదనపు బహుతులు అందిస్తోంది. మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి బహుమతిగా ఇస్తోంది. వాటిల్లో రూ. 1,24 990 విలువైన శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా లేదా రూ. 69,990 విలువైన 50-అంగుళాల సెరిఫ్ టీవీ లేదా రూ. 38,990 విలువైన సౌండ్‌బార్ ను ఉచితంగా పొందొచ్చు. అలాగే రిఫ్రిజిరేటర్‌లు, మైక్రోవేవ్‌లు, వాషింగ్ మెషీన్‌లపై తగ్గింపులను కూడా చూడవచ్చు. అలాగే 98 అంగుళాల టీవీలు, నియో క్యూఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ, 4కే యూహెచ్డీ టీవీలు ఆఫర్లపై లభిస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








