Samsung New Phone: సరికొత్త ఫీచర్లతో వస్తున్న శాంసంగ్ కొత్త ఫోన్.. బ్యాటరీ బ్యాకప్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Samsung New Phone: ప్రపంచ వ్యాపార రంగంలో నిలబడగాలంటే కొత్త ఆవిష్కరణలు అనివార్యం. వినియోగదారుల అభిరుచులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ..

Samsung New Phone: ప్రపంచ వ్యాపార రంగంలో నిలబడగాలంటే కొత్త ఆవిష్కరణలు అనివార్యం. వినియోగదారుల అభిరుచులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. వారిని ఆకట్టుకునేలా ప్రోడక్ట్స్ తీసుకువస్తేనే ఏ సంస్థ అయినా మనగలుగుతుంది. ఈ ఆవిష్కరణల విషయంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు ముందు వరుసలో ఉంటాయని చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారుల అభిరుచులకు తగిన విధంగా మొబైల్స్‌ను విడుదల చేస్తుంటాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆధరణ కలిగిన సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. ఇతర కంపెనీలకు చెందిన ఫోన్లకు ధీటుగా పెద్ద మొత్తంలో బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఈ ఫోన్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది. ఈ విషయాన్ని శాంసంగ్ కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం62 పేరుతో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉండనుంది. గెలాక్సీ ఎం51 ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా వస్తోన్న ఈ ఫోన్‌కు స్పీడ్‌గా ఛార్జ్ అయ్యేలా 25 వాట్స్‌తో చార్జర్ కూడా ఇవ్వనున్నారు. ఈ ఫోన్ ధర రూ. 23 నుంచి 25 వేల వరకు ఉండొచ్చని సమాచారం.
గెలాక్సీ ఎం62 ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..
- రిసొల్యూషన్: 1080 x 2400, 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ.
- ఫ్రంట్ కెమెరా: 64 MP +1.8+12+2.2+5+2.4
- రేర్ కెమెరా: 64 MP + 12 MP + 5 MP + 5 MP
- 4జీ ఎల్‌టీఈ
- డ్యూయల్ బ్యాండ్ వై-ఫై
- ఎన్ఎఫ్‌సీ సపోర్ట్
- 6 జీవీ ర్యామ్, 256 జీవీ ఇంటర్నల్ స్టోరేజీ
- ఆండ్రాయిడ్ 11
- ఎక్స్‌నోస్ 9825 ప్రాసెసర్
Also read: