కేవలం 45 సెకన్లలలో ‘నూడుల్స్’ రెడీ..!

ప్రముఖ బ్రాండ్ సంస్థలు నూడుల్స్‌ను.. కేవలం రెండు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చని.. పలు యాడ్స్‌లలో చూపించడం తెలుసు.. కానీ.. వినూత్నంగా కేవలం 45 సెకన్లలో నూడుల్స్ తయారీ అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే కదా..! అవును.. సింగపూర్‌లోని ఒక రోబొటిక్ 45 సెకన్లలోనే నూడుల్స్‌ని తయారు చేసి ఔరా అనిపిస్తోంది. ఆ రోబొటిక్ పేరు సోఫీ. సింగపూర్ దేశస్తుల ఫేవరెట్ ఫుడ్ ‘లక్సా’ను చేయడం కాస్త తలనొప్పి వ్యవహారం.. అలాంటిది మనుషుల అవసరం లేకుండానే.. ఆ రోబొటిక్ […]

కేవలం 45 సెకన్లలలో 'నూడుల్స్' రెడీ..!
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 9:08 PM

ప్రముఖ బ్రాండ్ సంస్థలు నూడుల్స్‌ను.. కేవలం రెండు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చని.. పలు యాడ్స్‌లలో చూపించడం తెలుసు.. కానీ.. వినూత్నంగా కేవలం 45 సెకన్లలో నూడుల్స్ తయారీ అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే కదా..!

అవును.. సింగపూర్‌లోని ఒక రోబొటిక్ 45 సెకన్లలోనే నూడుల్స్‌ని తయారు చేసి ఔరా అనిపిస్తోంది. ఆ రోబొటిక్ పేరు సోఫీ. సింగపూర్ దేశస్తుల ఫేవరెట్ ఫుడ్ ‘లక్సా’ను చేయడం కాస్త తలనొప్పి వ్యవహారం.. అలాంటిది మనుషుల అవసరం లేకుండానే.. ఆ రోబొటిక్ చకచకా చేసేస్తుంది. ఉడికించి సిద్ధం చేసిన పదార్థాలను తగిన మోతాదులో వడ్డిస్తూ సమయాన్ని ఆదా చేస్తోంది. వినియోగదారుడు సోఫీ వద్దకు వెళ్లి.. తమకు కావాల్సిన న్యూడిల్స్ సెలెక్ట్ చేస్తే చాలు.. ఒక గిన్నెలో వేసి ఇచ్చేస్తుంది. ఈ సోఫి.. గంటలో దాదాపు 80 గిన్నెల ‘లక్సా’ న్యూడిల్స్‌ని తయారు చేసి వినియోగదారులకు సర్వ్ చేసింది. దీంతో.. వినియోగదారులు కూడా తమ సమయం వృథా కాకపోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం చెఫ్స్ లక్సా తయారీకి అవసరమైనవన్నీ ఇస్తే.. చాలు.. మొత్తం పనులన్నీ అదే చూసుకుంటుంది.