కొత్త రూ.2వేలు, రూ.500నోట్లు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

రూ.2వేల నోట్లు త్వరలో రద్దు అవుతాయంటూ గత కొన్ని నెలలుగా వినిపిస్తోన్న వార్తలకు చెక్ పడింది. ఈ నోట్లను రద్దు చేసే ఆలోచన లేని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కొత్త డిజైన్‌తో ఆ నోట్లను తీసుకొస్తుంది. నకిలీ నోట్లకు అడ్డువేసే క్రమంలో కొత్త రూ.2వేలతో పాటు రూ.500నోట్లను

కొత్త రూ.2వేలు, రూ.500నోట్లు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 23, 2020 | 2:15 PM

రూ.2వేల నోట్లు త్వరలో రద్దు అవుతాయంటూ గత కొన్ని నెలలుగా వినిపిస్తోన్న వార్తలకు చెక్ పడింది. ఈ నోట్లను రద్దు చేసే ఆలోచన లేని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కొత్త డిజైన్‌తో ఆ నోట్లను తీసుకొస్తుంది. నకిలీ నోట్లకు అడ్డువేసే క్రమంలో కొత్త రూ.2వేలతో పాటు రూ.500నోట్లను తీసుకురానుంది ఆర్బీఐ. మహాత్మాగాంధీ బొమ్మతో ముస్తాబవుతోన్న ఈ నోట్‌ కలర్, సైజ్, థీమ్ అన్నింటిలోనూ మార్పులు ఉండబోతున్నాయి. మంగళయాన్ రివర్స్‌లో ఉండటమే కాదు మాగెంటా రంగులో కొత్త రెండువేల నోట్లు రానున్నాయి. బాగా పరిశీలిస్తే గానీ  రంగు మార్పు మనకు తెలియకపోవచ్చు.  66mm x 166mm సైజ్‌తో రాబోతున్న ఈ కొత్త నోట్ల గురించి కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా నకిలీని గుర్తుపట్టేందుకు అవి ఉపయోగపడతాయి.

కొత్త రూ.2వేల నోట్ ప్రత్యేకతలివే..!

1.లైట్‌లో పెట్టినప్పుడు నోటుకు పూర్తి ఎడమ భాగంలో రెండు వేల నంబర్ గుర్తు కనిపించనుంది 2.నోటును మన కంటి లెవల్ నుంచి 45డిగ్రీల కోణంలో మడిచినప్పుడు 2వేల నంబర్ కనిపించనుంది. 3. 2వేలు అన్న నంబర్ దేవనాగరి లిపిలో కరెన్సీ నోటుకు ఎడమ భాగంలో ఉండబోతోంది. 4.మహాత్మాగాంధీ బొమ్మ నోటు మధ్యలో కనిపించనుంది. 5. మహాత్మాగాంధీ బొమ్మ పక్కన ఆర్బీఐ, 2వేల అక్షరాలు ఉంటాయి. అయితే మైక్రోస్కోప్‌లో మాత్రమే వాటిని చూడగలం. 6. నోటును అటు ఇటూ తిప్పుతూ ఉన్నప్పుడు మహాత్మా గాంధీ బొమ్మ కలర్ బ్లూ నుంచి గ్రీన్‌లా మారనుంది. 7. గ్యారేంటీ క్లాజ్ సెక్షన్‌లో ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉండబోతోంది. 8. నోటుకు కుడి భాగంలో వాటర్‌మార్క్ సెక్షన్‌లో గాంధీ షాడో కనిపించబోతుంది. 9. నోటు మీద ఉన్న నంబర్ పానెల్ సైజ్‌ ఆరోహణ క్రమంలో ఉండబోతోంది. 10. నోటు మీద కుడి భాగంలో ప్రింట్ అయిన న్యూమరికల్ కలర్ గ్రీన్ నుంచి బ్లూకు మారనుంది. 11. నోటుకు పూర్తి కుడి వైపున అశోక చక్రం ఉండబోతోంది. 12. 2వేలు అన్న నంబర్ నోటుకు సమాంతరంగా ఓ దీర్ఘచతురస్త్రాకార టేబుల్‌లో ఉండబోతోంది. 13. నోటుకు రెండు వైపులా ఏడు యాంగులర్ లైన్లు ఉండబోతున్నాయి. అంధులు నకిలీ నోట్లను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి. 14. కరెన్సీ నోటు వెనుక భాగంలో ఆ నోటును ముద్రించిన సంవత్సరం ఉండబోతోంది. 15. కరెన్సీ నోటు వెనుక భాగం కిందలో స్వచ్ భారత్ నినాదం ఉండనుంది 16. కరెన్సీ నోటు వెనుక భాగం ఎడమ వైపులో ఓ బాక్స్‌లో 2000 రూపాయలు అని అని పలు భారతీయ భాషల్లో ఉండనుంది. 17. కరెన్సీ నోటు వెనుక భాగంలో ఇస్రో మార్స్ మిషన్ గుర్తు ఉండబోతోంది. 18. నోటు వెనుక భాగం పైన కూడా దేవనాగరి లిపిలో నోటు విలువ ఉండబోతోంది.

కొత్త రూ.500నోట్ ప్రత్యేకతలివే..!

1.లైట్‌లో పెట్టినప్పుడు నోటుకు పూర్తి ఎడమ భాగంలో 500 నంబర్ గుర్తు కనిపించనుంది 2.నోటును మన కంటి లెవల్ నుంచి 45డిగ్రీల కోణంలో మడిచినప్పుడు 500 నంబర్ కనిపించనుంది. 3.500 అన్న నంబర్ దేవనాగరి లిపిలో కరెన్సీ నోటుకు ఎడమ భాగంలో ఉండబోతోంది. 4.మహాత్మాగాంధీ బొమ్మ నోటు మధ్యలో కనిపించనుంది. 5.మహాత్మాగాంధీ బొమ్మ పక్కన ఆర్బీఐ భారత్ ఇండియా అక్షరాలు ఉంటాయి. అయితే మైక్రోస్కోప్‌లో మాత్రమే వాటిని చూడగలం. 6.నోటును అటు ఇటూ తిప్పుతూ ఉన్నప్పుడు మహాత్మా గాంధీ బొమ్మ కలర్ బ్లూ నుంచి గ్రీన్‌లా మారనుంది. 7.గ్యారేంటీ క్లాజ్ సెక్షన్‌లో ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉండబోతోంది. 8.నోటుకు కుడి భాగంలో వాటర్‌మార్క్ సెక్షన్‌లో గాంధీ షాడో కనిపించబోతుంది. 9.నోటు మీద ఉన్న నంబర్ పానెల్ సైజ్‌ ఆరోహణ క్రమంలో ఉండబోతోంది. 10.నోటు మీద కుడి భాగంలో ప్రింట్ అయిన న్యూమరికల్ కలర్ గ్రీన్ నుంచి బ్లూకు మారనుంది. 11.నోటుకు పూర్తి కుడివైపున అశోక చక్రం ఉండబోతోంది. 12.5వందలు అన్న నంబర్ నోటుకు సమాంతరంగా ఓ వృత్తాకారంలో ఉండబోతోంది. 13.నోటుకు రెండు వైపులా ఐదు యాంగులర్ లైన్లు ఉండబోతున్నాయి. అంధులు నకిలీ నోట్లను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి. 14.కరెన్సీ నోటు వెనుక భాగంలో ఆ నోటును ముద్రించిన సంవత్సరం ఉండబోతోంది. 15.కరెన్సీ నోటు వెనుక భాగం కిందలో స్వచ్ భారత్ నినాదం ఉండనుంది 16.కరెన్సీ నోటు వెనుక భాగం ఎడమ వైపులో ఓ బాక్స్‌లో 500 రూపాయలు అని అని పలు భారతీయ భాషల్లో ఉండనుంది. 17.కరెన్సీ నోటు వెనుక భాగంలో ఇస్రో మార్స్ మిషన్ గుర్తు ఉండబోతోంది. 18.నోటు వెనుక భాగం పైన కూడా దేవనాగరి లిపిలో నోటు విలువ ఉండబోతోంది.