AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi Note 12 5G: అతి తక్కువ ధరకే 5జీ ఫోన్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో అదిరే ఆఫర్లు.. మిస్ అవ్వొద్దు..

అక్టోబర్ ఎనిమిది నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమవతున్నాయి. ఈ సేల్స్ లో అన్ని టెక్ గ్యాడ్జెట్లపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, ఫోన్ యాక్సెసరీస్ అన్నీ కూడా సేల్లో తక్కువ ధరలకే ఉండనున్నాయి. ఇదే క్రమంలో గత ఆగస్టు నెలలో మన దేశంలో లాంచ్ అయిన 5జీ ఫోన్ రెడ్ మీ నోట్ 12 పై అదిరే ఆఫర్ ఈ సేల్స్ అందిస్తున్నాయి.

Redmi Note 12 5G: అతి తక్కువ ధరకే 5జీ ఫోన్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో అదిరే ఆఫర్లు.. మిస్ అవ్వొద్దు..
Redmi Note 12 5g
Madhu
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 05, 2023 | 9:00 PM

Share

ప్రస్తుతం అందరూ 5జీ ఫోన్ల కోసమే వెతుకుతున్నారు. తక్కువ ధరలో దొరికితే కొనుగోలు చేయాలనుకుంటున్నారు. వాస్తవానికి 5జీ ఫోన్లు మిడ్ రేంజ్ లో లభ్యమవుతుంటాయి. రూ. 10 వేల రేంజ్ లో కూడా ఓ 5జీ ఫోన్ల మీకు అందుబాటులోకి రానుంది. అది రెడ్ మీ నోట్ 12 5జీ. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఈ ఫోన్ అత్యంత భారీ తగ్గింపు ధరకు లభిస్తోంది. అక్టోబర్ ఎనిమిది నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమవతున్నాయి. ఈ సేల్స్ లో అన్ని టెక్ గ్యాడ్జెట్లపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, ఫోన్ యాక్సెసరీస్ అన్నీ కూడా సేల్లో తక్కువ ధరలకే ఉండనున్నాయి. ఇదే క్రమంలో గత ఆగస్టు నెలలో మన దేశంలో లాంచ్ అయిన 5జీ ఫోన్ రెడ్ మీ నోట్ 12 పై అదిరే ఆఫర్ ఈ సేల్స్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఏంటి? ఫీచర్లు ఏంటి? ధర, లభ్యత వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్ మీ నోట్ 12 5జీ ధర, లభ్యత..

ప్రస్తుతం ఈ రెడ్ మీ నోట్ 12 5జీ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర మన దేశంలో రూ. 15,999గా ఉంది. అయితే అమెజాన్ లో ప్రత్యేక ఫెస్టివ్ సేల్లో కనిపించిన ప్రోమోషనల్ చిత్రంలో మాత్రం దీనిని మీరు రూ. 13,999కే కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. దీనికి అదనంగా పలు బ్యాంక్ ఆఫర్లు ఉంటాయని పేర్కొంది. అదే విధంగా ఇదే రెడ్ మీ నోట్ 12 4జీ వేరియంట్ ఫోన్ మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తక్కువ ధరకే అందిస్తోంది. కేవలం రూ. 10,799 దీనిని కొనుగోలు చేయొచ్చని ప్రమోషనల్ చిత్రాల్లో స్పష్టమవుతోంది. దీనిలో ఎక్స్ చేంజ్ ఆఫర్ రూ. 1,000, ఇతర డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు కలిపి పై ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రాస్టెడ్ గ్రీన్, మ్యాట్ బ్లాక్, మిస్టిక్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంది.

రెడ్ మీ నోట్ 12 5జీ స్పెసిఫికేషన్స్..

ఈ 5జీ హ్యాండ్ సెట్లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ (1,080×2,400 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 240Hz వరకు టచ్ శ్యాంప్లింగ్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ ఉంటుంది. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ ఉంటుంది. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ద్వారా సమీకృత అడ్రెనో 619 జీపీయూ ప్రాసెసర్ తో ఈ ఫోన్ శక్తిని పొందుతుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

కెమెరా విషయానికి వస్తే ఈ రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్లో 48ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, వెనుకవైపు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ముందు 13-మెగాపిక్సెల్ సెన్సార్స్ ఉన్నాయి. ఫోన్ 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP53 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..