Chat GPT: డాక్టర్లు నయం చేయని సమస్యకు చాట్‌జీపీటీ పరిష్కారం… నమ్మలేని నిజం ఇదే..!

టెక్ రంగంలో చాట్ జీపీటీ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ ఏఐకు సంబంధించిన చాట్ జీపీటీ ఇటీవల కాలంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. గతంలో ఏదైనా అనుమానం వస్తే గూగుల్‌ను ఆశ్రయించే వినియోగదారులు క్రమేపి చాట్ జీపీటీ ద్వారా తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. తాజాగా చాట్ జీపీటీ ఏళ్లుగా డాక్టర్లు నయం చేయలేని తన సమస్యను పరిష్కరించిందని ఓవ్యక్తి రెడ్ ఇట్‌లో పోస్ట్ చేశారు.

Chat GPT: డాక్టర్లు నయం చేయని సమస్యకు చాట్‌జీపీటీ పరిష్కారం… నమ్మలేని నిజం ఇదే..!
Chatgpt Jaw Problem

Updated on: Apr 18, 2025 | 1:40 PM

ఇటీవల రెడ్ ఇట్ వినియోగదారుడు ఓపెన్ ఏఐకు సంబంధించిన చాట్ జీపీటీ ఐదు సంవత్సరాలకు పైగా తనును నిరంతరం వెంటాడుతున్న దవడ సమస్యకు 60 సెకండ్స్‌లో పరిష్కరించడానికి సహాయపడిందని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల దవడ క్లిక్ తర్వాత (టీఎంజే లేదా టెంపోరోమాండిబ్యులర్ జాయింట్) సమస్యను చాట్ జీపీటీ 60 సెకన్లలో నయం చేసిందని వివరించారు. తనకు ఎడమ వైపున దీర్ఘకాలిక దవడ క్లిక్ సమస్య వేధిస్తుందని, గతంలో బాక్సింగ్ గాయం కారణంగా ఇది జరిగిందని పేర్కొన్నారు. 

తన దవడం సమస్యపై ఒక ఈఎన్‌టీ నిపుణుడితో సంప్రదించాక ఆయన రెండు సార్లు ఎంఆర్ఐలు (కాంట్రాస్ట్ డైతో సహా) తీసి ఫేషియల్ నిపుణుడికి రిఫెరల్ చేశాడు. అతడిని సంప్రదించినా ఆ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నాడు అయితే ఈ సమస్యను చాట్ జీపీటీ ద్వారా నయం చేసుకున్నానని వివరించారు. తన దవడ సమ్యను పరిష్కారం చూపాలంటూ చాట్ జీపీటీలో ప్రశ్న వేయగా కొన్న సూచనలు వచ్చాయని ఆయ సూచనలు పాటించగా ఆశ్చర్యకరంగా తన సమస్య పరిష్కారమైందని పేర్కొన్నారు.  ఎవరికైనా దవడ క్లికింగ్ సమస్య ఉంటే ఓ సారి ఏఐను ఆశ్రయించాలని వివరించారు. 

అయితే ఈ పోస్ట్‌పై విభిన్న కామెంట్స్ వస్తున్నాయి.  ఇదే సమస్యతో బాధపడుతున్న కొంతమంది వినియోగదారులు చాట్ జీపీటీ అందించిన పరిష్కారం తమకు కూడా పనిచేసిందని చెప్పారు. టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ డిజార్డర్స్ సమస్య తేలికపాటి క్లిక్ చేయడం నుంచి తీవ్రమైన నొప్పి, క్రియాత్మక పరిమితుల వరకు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఫిజికల్ థెరపీ లేదా చిన్న సర్దుబాట్లతో నయం చేయవచ్చని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి