AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SmartPhone: స్మార్ట్‌ఫోన్ రంగంలో సంచలనం.. పది వేల ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్..!

ఇటీవల కాలంలో యువత అధికంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్మార్ట్ ఫోన్స్ ద్వారా గేమ్స్ వాడే వారి సంఖ్య క్రమేపి పెరుగుతుంది. ఇలాంటి వారిని చార్జింగ్ సమస్య తెగ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ తయారీ కంపెనీ రియల్ మీ ఏకంగా 10 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తున్నామని పేర్కొంది. ఈ వార్త స్మార్ట్ ఫోన్ రంగంలో సంచలనం సృష్టించింది.

SmartPhone: స్మార్ట్‌ఫోన్ రంగంలో సంచలనం.. పది వేల ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్..!
Realme Gt
Follow us
Srinu

|

Updated on: May 08, 2025 | 3:10 PM

భారతదేశంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థగా ఉన్న రియల్ మీ త్వరలో 10 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో విడుదలైన రియల్ మీ జీటీ-7 స్మార్ట్ ఫోన్ ఇండియన్ వేరియంట్ ఒక ప్రధాన హైలైట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రియల్ మీ జీటీ 7 ప్రో నవంబర్ 2024లో భారతదేశంలో ప్రారంభించారు. అయితే తాజాగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 320 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉండే కాన్సెప్ట్ ఫోన్ గురించి రియల్ మీ ప్రకటించింది. రియల్ మీ జీటీ -7 ఫోన్‌తో పాటు కాన్సెప్ట్ ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కాన్సెప్ట్ ఫోన్ వాణిజ్య మార్కెట్లోకి వస్తుందో లేదో స్పష్టంగా తెలియకపోయినా ఇది స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ టెక్నాలజీ భవిష్యత్‌ను అర్థం చేసుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

రియల్ మీ కాన్సెప్ట్ ఫోన్‌లో ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ ప్రోటోటైప్ 8.5 మిమీ కంటే తక్కువ మందం, 200 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ బరువు ఉంటుందని రియల్‌మీ ధ్రువీకరించింది. ఈ ఫోన్ సెమీ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ కవర్‌తో వస్తుందని స్పష్టం చేసింది. రియల్ మీ జీటీ కాన్సెప్ట్ ఫోన్ డిజైన్ అత్యుత్తమ లక్షణాలలో ఒకటిగా నిలుస్తుంది. ముఖ్యంగా మినీ డైమండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ వల్ల పది వేల ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్‌లో అమర్చడానికి సాధ్యపడిందని రియల్ మీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ డిజైన్ ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన ఆండ్రాయిడ్ మెయిన్‌బోర్డ్‌కు దోహదం చేస్తుంది. రియల్‌మీ కొత్త కాన్సెప్ట్ ఫోన్‌లో అల్ట్రా-హై సిలికాన్-కంటెంట్ యానోడ్ బ్యాటరీ కూడా ఉంది. ఈ బ్యాటరీ 10 శాతం సిలికాన్ నిష్పత్తితో వస్తుంది. ఇ

రియల్ మీ జీటీ కాన్సెప్ట్ ఫోన్ ఇంకా ప్రోటోటైప్ దశలోనే ఉన్నప్పటికీ దాని డిజైన్, ఫీచర్లు స్మార్ట్‌ఫోన్‌ల భవిష్యత్ ఎక్కువ బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ఛార్జింగ్, ఫోన్ స్పేస్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడం ఎలా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రియల్ మీ తీసుకున్న సాహసోపేతమైన చర్య స్మార్ట్ ఫోన్ పరిశ్రమకు కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుందని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి