AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Saving Tips: వాషింగ్ మెషిన్ ఇలా వాడితే మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గడం పక్కా.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ టిప్స్ ఇవే..

మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ వాడుతున్నారా.. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని బాధపడుతున్నారా.. అయితే మీ కోసమే ఇది. కొన్ని టిప్స్ పాటించడం వల్ల కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. భారీగా కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

Power Saving Tips: వాషింగ్ మెషిన్ ఇలా వాడితే మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గడం పక్కా.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ టిప్స్ ఇవే..
Washing Machine
Venkatrao Lella
|

Updated on: Jan 26, 2026 | 10:32 PM

Share

ఇటీవల ప్రతీఒక్కరూ తమ ఇళ్లల్లో వాషింగ్ మెషిన్లు ఉపయోగిస్తున్నారు. సామాన్యులు కూడా వీటిని వాడుతున్నారు. అయితే వాషింగ్ మెషిన్‌కు విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. దీంతో విద్యుత్ బిల్లుల భారం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎక్కువమంది సభ్యులు ఉంటే వాషింగ్ మెషిన్ తరచూ వాడాల్సి ఉంటుంది. దీని వల్ల కరెంట్ బిల్లు పేలిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాషింగ్ మెషిన్‌కు ఖర్చయ్యే విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. కొన్ని పాటిస్తే సగానికి సంగం బిల్లు తగ్గించుకోవచ్చు ఈ స్మార్ట్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ టిప్స్ ఇవే..

-రాత్రి సమయాల్లో వాషింగ్ మెషిన్ వాడండి -వేడి నీళ్లు వాడకండి -కేవలం చల్లటి నీటిని మాత్రమే వాషింగ్ మెషిన్‌లో యూజ్ చేయండి -పూర్తి లోడ్ ఉన్నప్పుడే వాడండి -కరెంట్ వినియోగం ఎక్కువగా ఉండే పీక్ అవర్స్‌లో అస్సలు వాడకండి -చలికాలం ఉదయం, వేసవికాలంలో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గ్రిడ్‌పై లోడ్ పడి కరెంట్ బిల్లు పెరుగవచ్చు -రాత్రిపూట వాడటం వల్ల మీటర్ రీడింగ్ కంట్రోల్‌లో ఉండి కరెంట్ బిల్లు తగ్గుతుంది

వేడి నీళ్లు వద్దు

జిడ్డు మరకలు లేదా బాగా మురికిగా ఉన్నప్పుడు మినహా మిగతా సమాయల్లో కూల్ వాటర్‌నే వాషింగ్ మెషిన్ కోసం ఉపయోగించండి. వాషింగ్ మెషిన్లు 90 శాతం విద్యుత్‌ను నీటిని వేడి చేయడానికే ఎక్కువగా ఉపయోగిస్తాయి. దీంతో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఇక వాషింగ్ మెషిన్‌లో డ్రైయర్ వాడటం వల్ల ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. దీనికి బదులు బయట ఆరబెట్టుకోవడమే మంచిది. అత్యవసరమైతే తప్పితే డ్రైయర్ ఉపయోగించండి. ఇక బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడే వాషింగ్ మెషిన్ ఉపయోగించండి.