Poco X8s ధర, ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే.. భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో మరెన్నో
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Poco మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. Poco X8s పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఆకట్టుకునే డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించారు. ముఖ్యంగా 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్‌ప్లే, Snapdragon 7 Gen 4 చిప్‌సెట్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. ఫొటోగ్రఫీ కోసం 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. రోజంతా ఫోన్ ఉపయోగించే వారికి అనువుగా 6,330mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు.

ప్రస్తుతం Poco X8s స్మార్ట్‌ఫోన్‌ను పోలాండ్, సింగపూర్ మార్కెట్లలో విడుదల చేశారు. ఇందులో గరిష్ఠంగా 12GB RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. డిస్‌ప్లే నుంచి కెమెరాల వరకు పలు ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో వచ్చిన ఈ ఫోన్ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే ఆసక్తి నెలకొంది. అయితే ఇండియా లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.
120Hz AMOLED డిస్‌ప్లే..
Poco X8sలో 6.35 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1Hz నుంచి 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ ప్రత్యేకత. ప్రాసెసింగ్ కోసం Snapdragon 7 Gen 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులో గరిష్ఠంగా 12GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి.
కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. Light Fusion 800 సెన్సార్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫొటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 20MP కెమెరా ఇచ్చారు.
6,330mAh బ్యాటరీ..
బ్యాటరీ విభాగంలో Poco X8sలో 6,330mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించారు. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బ్లూ, బ్లాక్, వైట్ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే పోలాండ్‌లో 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర PLN 1,599 (సుమారు రూ.38,000)గా ఉంది. 12GB RAM, 512GB స్టోరేజ్ మోడల్ ధర PLN 1,799 (సుమారు రూ.43,000). సింగపూర్‌లో 8GB RAM, 256GB వేరియంట్ ధర SGD 619 (సుమారు రూ.45,000)గా నిర్ణయించారు. భారత మార్కెట్లో ఈ ఫోన్ విడుదల తేదీ, ధరపై Poco నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
