AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్.. చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు..ఎలా?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp.. యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో Android యూజర్ల కోసం మరో ఆసక్తికరమైన ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా WhatsAppలో ఎవరి నుంచైనా మెసేజ్ వస్తే దాన్ని చదవాలంటే ఆ చాట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే చాట్ ఓపెన్ చేయకుండానే వచ్చిన మెసేజ్‌లను ప్రివ్యూ రూపంలో చదివే అవకాశం ఉంటుంది.

WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్.. చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు..ఎలా?
Whatsapp Android Chat Preview Feature
Nikhil
|

Updated on: Nov 07, 2026 | 9:00 PM

Share

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చాట్ లిస్ట్‌లోని ఏదైనా చాట్‌పై కొద్దిసేపు నొక్కి ఉంచితే ప్రత్యేకమైన ప్రివ్యూ విండో కనిపిస్తుంది. అందులో ఇటీవల వచ్చిన మెసేజ్‌లను చూడటంతో పాటు స్క్రోల్ చేసి మరిన్ని సందేశాలను చదవవచ్చు. ముఖ్యంగా అవతలి వ్యక్తికి బ్లూ టిక్స్ వెళ్లకుండా మెసేజ్‌లను తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. iPhone యూజర్లకు ఇప్పటికే ఇలాంటి సదుపాయం అందుబాటులో ఉండగా, Android యాప్‌లో మాత్రం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.

చాట్ ప్రివ్యూలోనే కంట్రోల్స్

ఈ కొత్త ఫీచర్ కేవలం మెసేజ్‌లను చదవడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రివ్యూ విండో నుంచే చాట్‌ను Readగా మార్క్ చేయడం, Pin చేయడం, Archive చేయడం, Select చేయడం, Delete చేయడం వంటి ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, More Options మెనూలో చాట్‌ను Lock చేయడం, లిస్ట్‌లో చేర్చడం, చాట్ సమాచారాన్ని చూడటం, హోమ్ స్క్రీన్‌పై షార్ట్‌కట్ క్రియేట్ చేయడం వంటి అదనపు సదుపాయాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. దీంతో చాట్‌లను నిర్వహించడం మరింత సులభం కానుంది.

బ్లూ టిక్స్ పడకుండా..

ఈ ఫీచర్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే.. చాట్‌ను పూర్తిగా ఓపెన్ చేయకుండా ప్రివ్యూలోనే మెసేజ్‌లు చదవవచ్చు. అలా చదివినప్పుడు అవతలి వ్యక్తికి బ్లూ టిక్స్ వెళ్లవని సమాచారం. అంటే యూజర్ల Unread స్టేటస్ అలాగే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. WhatsApp అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బీటా వెర్షన్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? సాధారణ యూజర్లకు ఎప్పటి నుంచి లభిస్తుంది? అనే వివరాలు కూడా వెల్లడించలేదు. అభివృద్ధి పూర్తయిన తర్వాత భవిష్యత్తు అప్‌డేట్‌లో ఈ ఫీచర్ వచ్చే అవకాశం ఉంది.

Follow Us