AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 8 రాశిఫలాలు: ఈ రోజు ఆ రాశుల వారికి అదృష్టం..! ఆకస్మిక ధనలాభం

Horoscope Today (November 8, 2026): ఆదివారం రోజున గ్రహాల సంచారం 12 రాశుల వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది? కొందరికి వ్యాపారాల్లో మంచి ఆదాయం, మరికొందరికి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయా? ఆకస్మిక ధన లాభం ఎవరికి కలగనుంది? ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఆదివారం దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

నవంబర్ 8 రాశిఫలాలు: ఈ రోజు ఆ రాశుల వారికి అదృష్టం..! ఆకస్మిక ధనలాభం
Horoscope Today 08 Nov 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 08, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 8, 2026): మేష రాశి వారికి ఈ రోజు వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా, సామరస్యంగా సాగిపోతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికపరంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడికి గురవుతారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా కలిసివస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఆర్థి కంగా కాస్తంత అభివృద్ధి ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నిటినీ సానుకూలంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరి చయాలు పెరుగుతాయి. సామాజికంగా అనుకోని గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగు తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సా హంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొన్ని ప్రయత్నాల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరి ష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగానే నెరవేరుతాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరు గుతాయి. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. స్నేహితులు, సహచరుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆదాయం బాగానేఉంటుంది కానీ, నష్టదాయక వ్యవహారాల మీద డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగ జీవితం బాగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబపరంగా కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరు ద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

Follow Us