AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఈ వాస్తు మార్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం..! సిరిసంపదలు పక్కా

Vastu Tips to Attract Money and Wealth: ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సిరిసంపదలు పెరగాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. ఇందుకోసం వాస్తు నియమాలను కూడా పాటిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు. ఇంతకీ సంపద, ఆర్థిక అభివృద్ధి కోసం పాటించాల్సిన ఆ 5 ముఖ్యమైన వాస్తు చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.

Vastu Tips: ఇంట్లో ఈ వాస్తు మార్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం..! సిరిసంపదలు పక్కా
Vastu Tips
Janardhan Veluru
|

Updated on: Nov 05, 2026 | 6:54 PM

Share

ప్రతి ఒక్కరూ జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని, ఆదాయం పెరగాలని, ఇంట్లో సంపదకు లోటు లేకుండా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం కష్టపడి పనిచేయడంతో పాటు ఇంటి వాస్తుపై కూడా చాలామంది ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. వాస్తు శాస్త్రం(Vastu Shastra) ప్రకారం ఇంట్లోని దిశలు, వస్తువుల అమరిక ఆ ఇంట్లో నివసించే వారిపై సానుకూల ప్రభావం చూపుతాయని నమ్ముతారు. ముఖ్యంగా వాస్తు మేరకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు పాటించాల్సిన ఐదు వాస్తు చిట్కాలు (Vastu Tips) ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర దిశలో డబ్బు డబ్బా ఉంచండి

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ సంపదకు సంబంధించిన దిశగా భావిస్తారు. అందువల్ల ఇంట్లో ఉత్తర దిశలో మనీ బాక్స్ లేదా పిగ్గీ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తారు. అందులో క్రమం తప్పకుండా కొంత డబ్బు వేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొదుపు అలవాటు పెరగడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుందని నమ్ముతారు.

ఆగ్నేయ దిశలో రాగి స్వస్తిక్

ఇంట్లోని ఆగ్నేయ మూలలో రాగితో తయారు చేసిన స్వస్తిక్ చిహ్నాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్తు సూచనలు చెబుతున్నాయి. దీనివల్ల ఆర్థిక లావాదేవీల్లో అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. తద్వారా చేతిలో నగదు నిల్వ ఉండేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వాస్తు నిపుణులు సూచిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి

ఇంట్లో వస్తువులను చిందరవందరగా ఎక్కడపడితే అక్కడ పడేయకుండా క్రమపద్ధతిలో అమర్చుకోవాలి. ముఖ్యంగా అవసరం లేని వస్తువులను తొలగించాలి. ఇల్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా, అందంగా ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం పరిశుభ్రంగా, చిందరవందర లేకుండా ఉండే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతారు. ఇది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణానికి కూడా దోహదపడుతుంది.

కొన్ని దిశల్లో చెత్తబుట్టలు ఉంచకండి

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం, పడమర, ఆగ్నేయ దిశల్లో చెత్తబుట్టలు లేదా పనికిరాని వస్తువులను ఉంచకూడదని నమ్ముతారు. ఈ దిశల్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. చెత్తబుట్టలు ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు వేరే ప్రదేశానికి మార్చడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తారు.

విలువైన వస్తువులను పడమర దిశలో ఉంచండి

ఇంట్లోని ముఖ్యమైన పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను పడమర దిశలో భద్రపరచుకోవడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వీటిని ఒక క్రమపద్ధతిలో భద్రపరచడం వల్ల అవసరమైనప్పుడు సులభంగా తీసుకోవడంతో పాటు ఇంట్లో వస్తువుల నిర్వహణ కూడా మెరుగుపడుతుంది.

ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం చాలామందికి మానసిక సంతృప్తిని ఇస్తుంది. అయితే ఆర్థికంగా ఎదగడానికి కేవలం వాస్తు నియమాలు పాటించడంతో పాటు పొదుపు, సరైన పెట్టుబడులు, ఖర్చుల నియంత్రణ వంటి ఆర్థిక క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం కూడా ఎంతో అవసరం.

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు వాస్తు శాస్త్రంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, సూచనలు మాత్రమే. వాస్తు చిట్కాలు పాటించడం వల్ల సంపద తప్పకుండా పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపితమైన ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి)

Follow Us
ఇంట్లో ఈ వాస్తు మార్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం..! సిరిసంపదలు
ఇంట్లో ఈ వాస్తు మార్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం..! సిరిసంపదలు
పియర్ పండ్లు తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య లాభాలు తెలిస్తే..
పియర్ పండ్లు తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య లాభాలు తెలిస్తే..
రొట్టె కాలుతుండగా బద్దలైన అగ్నిపర్వతం.. 2 వేల ఏళ్ల కు బయటకు!
రొట్టె కాలుతుండగా బద్దలైన అగ్నిపర్వతం.. 2 వేల ఏళ్ల కు బయటకు!
హైదరాబాద్‌లో కొత్త కల్చర్.. వృద్ధుల కోసం లగ్జరీ ఇళ్లు!
హైదరాబాద్‌లో కొత్త కల్చర్.. వృద్ధుల కోసం లగ్జరీ ఇళ్లు!
టీటీడీ గుడ్ న్యూస్.. వారికి ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ..
టీటీడీ గుడ్ న్యూస్.. వారికి ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ..
గుర్నూర్ మాస్టర్ ప్లాన్ వెనుక అర్ష్‌దీప్, కాంబోజ్
గుర్నూర్ మాస్టర్ ప్లాన్ వెనుక అర్ష్‌దీప్, కాంబోజ్
ఎంతమందిలో ఉన్నా దోమలు మిమ్మల్నే ఎందుకు కుడతాయి..?
ఎంతమందిలో ఉన్నా దోమలు మిమ్మల్నే ఎందుకు కుడతాయి..?
ఒక్క షేర్‌తోనే సినిమా మొత్తం బడ్జెట్ మొత్తం వచ్చేసింది..
ఒక్క షేర్‌తోనే సినిమా మొత్తం బడ్జెట్ మొత్తం వచ్చేసింది..
ఎబోలా కట్టడికి చారిత్రక నిర్ణయం..క్లినికల్ ట్రయల్స్‌లో భారత్‌కు
ఎబోలా కట్టడికి చారిత్రక నిర్ణయం..క్లినికల్ ట్రయల్స్‌లో భారత్‌కు
రూ.5 కోట్లు ఇవ్వ‌కుంటే లేపేస్తాం.. మ‌రో న‌టుడికి బెదిరింపులు
రూ.5 కోట్లు ఇవ్వ‌కుంటే లేపేస్తాం.. మ‌రో న‌టుడికి బెదిరింపులు