AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డులు క్రియేట్ చేస్తున్న Oppo A7 Pro Max.. బ్యాటరీ, ఫీచర్లు తెలిస్తే టెక్​ ప్రియులకు పండుగే

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు చాలామంది కెమెరా, ప్రాసెసర్‌, డిస్‌ప్లేతో పాటు బ్యాటరీ సామర్థ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా తరచూ ఫోన్ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఎక్కువసేపు ఉపయోగించాలనుకునే వారి కోసం కంపెనీలు భారీ బ్యాటరీలతో కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో Oppo సంస్థ ఏకంగా 12,000mAh బ్యాటరీ సామర్థ్యంతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు చైనా సర్టిఫికేషన్‌ డేటాబేస్‌లో కనిపించడం ఆసక్తికరంగా మారింది.

రికార్డులు క్రియేట్ చేస్తున్న Oppo A7 Pro Max.. బ్యాటరీ, ఫీచర్లు తెలిస్తే టెక్​ ప్రియులకు పండుగే
Oppo Pnc110
Nikhil
|

Updated on: Nov 07, 2026 | 9:10 PM

Share

XpertPick నివేదిక ప్రకారం, Oppo ఇంకా అధికారికంగా ప్రకటించని PNC110 మోడల్ నంబర్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్ చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) డేటాబేస్‌లో నమోదైంది. ఈ జాబితాలో ఫోన్ బ్యాటరీ రేటెడ్ కెపాసిటీ 11,640mAhగా ఉంది. సాధారణంగా రేటెడ్ కెపాసిటీ కంటే టిపికల్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ లెక్కన ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 12,000mAhగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ 5G కనెక్టివిటీకి సపోర్ట్‌ చేయనున్నట్లు సర్టిఫికేషన్‌ వెల్లడిస్తోంది.

రికార్డును అధిగమించనున్న కొత్త ఫోన్

ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తే Oppo చరిత్రలోనే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది. ప్రస్తుతం ఈ రికార్డు గత ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని మార్కెట్లలో విడుదలైన Oppo A7 Pro Max పేరిట ఉంది. ఆ ఫోన్‌లో 10,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందించారు. దీని ప్రారంభ ధర 599 యూరోలు కాగా, భారత కరెన్సీలో సుమారు రూ.61,000గా ఉంది. 6GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో ఈ మోడల్‌ విడుదలైంది.

Oppo A7 Pro Maxలో Qualcomm Snapdragon 4 Gen 5 ప్రాసెసర్‌, Adreno 629 GPU ఉన్నాయి. ఇందులో గరిష్ఠంగా 8GB LPDDR4x RAM, 256GB UFS 3.1 స్టోరేజ్‌ అందించారు. 6.78 ఇంచుల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, 330Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ ఉన్నాయి. High Brightness Modeలో 1,800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది.

ఫీచర్లు ఇంకా రహస్యమే

Oppo PNC110 ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ సామర్థ్యం, 5G సపోర్ట్‌ మినహా ఇతర వివరాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. ఇందులో ఏ ప్రాసెసర్‌ ఉపయోగిస్తారు? డిస్‌ప్లే ఎలా ఉంటుంది? కెమెరా ఫీచర్లు, ఛార్జింగ్‌ సామర్థ్యం ఎంత? అనే విషయాలపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఫోన్‌కు సంబంధించిన పేరు, ధర, లాంచ్ తేదీ కూడా ఇంకా వెల్లడించలేదు.

అంతేకాదు, ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌కే పరిమితం అవుతుందా? భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ విడుదల చేస్తారా? అనే దానిపై స్పష్టత లేదు. MIIT సర్టిఫికేషన్‌లో కనిపించిన వివరాలు ప్రస్తుతానికి లీక్‌ సమాచారం మాత్రమే. Oppo అధికారిక ప్రకటన వచ్చే వరకు ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, విడుదల తేదీ గురించి వేచి చూడాల్సిందే.

Follow Us